షర్మిల ఇంట్లో పెళ్లి సందడి?
వైఎస్ షర్మిల, అనిల్ కుమారుడు రాజారెడ్డి పెళ్లి పీటలెక్కనున్నారని తెలుస్తున్నది. అమెరికాలో నివసిస్తున్న ప్రియా పొట్లూరిని అతడు వివాహం చేసుకోనున్నారని సమాచారం

వైఎస్ షర్మిల, అనిల్ కుమారుడు రాజారెడ్డి పెళ్లి పీటలెక్కనున్నారని తెలుస్తున్నది. అమెరికాలో నివసిస్తున్న ప్రియా పొట్లూరిని అతడు వివాహం చేసుకోనున్నారని సమాచారం. రాజారెడ్డి సైతం గత కొన్నేళ్లుగా అమెరికాలోనే ఉండి చదువుకుంటున్నారు. రాజా కులాంతర వివాహం చేసుకోబుతున్నారని తెలుస్తున్నది. అట్లూరి విజయ వెంకట ప్రసాద్ కుమార్తె ప్రియ.
ఆమెకూడా అమెరికాలోనే చదువుకుంటున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరికీ పరిచయం ఉన్నదని చెబుతున్నారు. వైఎస్ కుటుంబంలో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా ఈ వివాహం.. తెలుగు రాష్ట్రాల్లో ఒక హై ప్రొఫైల్ పెళ్లిగా నిలువనున్నది.