Beach Bathing Viral Video | బికినీలేసుకుని.. సబ్బు రుద్దుకుంటూ.. కెనడా బీచ్‌లో ‘భారతీయుల’ స్నానంపై ట్రోలింగ్‌

అసలే కెనడాలో భారతీయులపై స్థానికులు గుర్రుమంటున్నారు. ఈ క్రమంలో కొన్ని వీడియోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. అవి భారతీయులుగా చెబుతున్న కొందరు కెనడా బీచ్‌లలో స్నానం చేస్తున్న దృశ్యాలు. బీచ్‌లలో జలకాలాటలు ఆడటం తప్పేమీ కాదు. అయితే.. వీళ్లు స్నానం చేసే సమయంలో సబ్బు రుద్దుకుంటూ నీళ్లలో మునగడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

Beach Bathing Viral Video | బికినీలేసుకుని.. సబ్బు రుద్దుకుంటూ.. కెనడా బీచ్‌లో ‘భారతీయుల’ స్నానంపై ట్రోలింగ్‌

Beach Bathing Viral Video  | అసలే కెనడాలో భారతీయులపై స్థానికులు గుర్రుమంటున్నారు. ఈ క్రమంలో కొన్ని వీడియోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. అవి భారతీయులుగా చెబుతున్న కొందరు కెనడా బీచ్‌లలో స్నానం చేస్తున్న దృశ్యాలు. బీచ్‌లలో జలకాలాటలు ఆడటం తప్పేమీ కాదు. అయితే.. వీళ్లు స్నానం చేసే సమయంలో సబ్బు రుద్దుకుంటూ నీళ్లలో మునగడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు కొన్ని వీడియోలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వాటిలో రెండు వీడియోలు వైరల్‌గా మారాయి. వీరి చర్యపై నెటిజన్లు సైతం మండిపడ్డారు. వైరల్‌ అయిన ఒక వీడియోలో రెండు జంటలు సబ్బుతో, షాంపూలతో స్నానం చేస్తుండటం కనిపిస్తుంది. జలాశయాల్లో, నీటి వనరుల్లో ఇలా సబ్బులు వాడుతూ నీటిని కలుషితం చేయడమేంటని కొందరు నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఇలా చేయడం వల్ల నీళ్లలోని చేపల వంటి జీవరాసులకు హాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదే సందుగా జాత్యహంకార వ్యాఖ్యలు సైతం చేశారు. నెటిజన్లు వాళ్లను భారతీయులని ఆరోపిస్తున్నప్పటికీ.. ఆ విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. కెనడాలోని బ్రాంప్టన్‌ నగర బీచ్‌లో ఈ వీడియో చిత్రీకరించినట్టు తెలుస్తున్నది. ఒక యూజర్‌ ఈ నగరం పేరును ప్రస్తావిస్తూ.. ‘మా దేశంలో ఏం జరుగుతున్నది? జలాశయాలు మీ బాత్‌టబ్‌లు కాదు. వాటిలో మేం ఈత కొడతాం’ అని రాశాడు. దీనిపై అధికారులు శ్రద్ధ పెట్టాలని కోరాడు. ఇవి తమ స్వచ్ఛమైన బీచ్‌లని, వాటిని పాడు చేస్తున్నారని మండిపడ్డాడు. వాళ్లపై జరిమానా విధించాలని డిమాండ్‌ చేశాడు. ‘అక్కడ సబ్బులు వాడటం నిషిద్ధం. సబ్బు.. జలాలను పొల్యూట్‌ చేస్తుంది’ అని మరొకరు రాశారు. ‘సబ్బులు, షాంపూలు చేపలు, ఇతర జల జీవజాతులకు మంచిది కాదు’ అని ఇంకొకరు స్పందించారు. మరొకరైతే గంగా నదితో పోల్చుతూ.. అందమైన, స్వచ్ఛమైన బీచ్‌లను గంగా నదిలా మార్చాలని చూస్తున్నారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి..

కొడుకును విడిపించడం కోసం న్యాయవాదిగా మారిన 90 ఏళ్ల వృద్ధురాలు
2027 ODI World Cup | ‘విరాట్‌’ పర్వం ముగిసినట్టేనా? రో‘హిట్‌’ బాదుడు చూడలేమా? సంచలన వార్తల సారాంశం?
Toll Plaza | దేశంలో అత్యంత ఖ‌రీదైన టోల్ ప్లాజా ఇదే..! ఆదాయం కోట్ల రూపాయాల్లోనే..!!
Andhra Pradesh | కింగ్ కోబ్రా అభయారణ్యం..ఏపీలోనే !