Life style | ఈ ఐదు ర‌కాల వ్యక్తుల‌ను అస్సలు పెండ్లి చేసుకోవ‌ద్దు..!

Life style | అలాంటి వ్యక్తులు జీవిత భాగ‌స్వాములైతే జీవితం న‌ర‌కంలా మారుతుంది. కాబ‌ట్టి జీవిత భాగ‌స్వామిని ఎంచుకునే ముందు ఒక‌టికి రెండు సార్లు బాగా ఆలోచించాలి. ముఖ్యంగా ఈ కింద పేర్కొన్న ఐదు ర‌కాల వ్యక్తులను అస్సలు వివాహం చేసుకోవ‌ద్దు.

Life style | ఈ ఐదు ర‌కాల వ్యక్తుల‌ను అస్సలు పెండ్లి చేసుకోవ‌ద్దు..!

Life style : ప్రేమ, మోహం అనేవి రెండూ మంచివే. కానీ ఒక వ్యక్తిని పెండ్లి చేసుకునే స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు మాత్రం ఈ ప్రేమ, వ్యామోహం విష‌యంలో చాలా ప్రాక్టిక‌ల్‌గా ఉండాలి. చూడగానే ప్రేమించి, మోహిస్తే ఎదుటి వ్యక్తుల్లోని కొన్ని అవ‌ల‌క్షణాలను మనం గుర్తించలేకపోతాం. కాబట్టి చేసుకోబోయే వ్యక్తి గుణగణాలపై కొంత అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే అడుగు ముందుకు వేయడం ఉత్తమం. తొందరడితే వారిలోని అవలక్షణాలు మ‌న‌ల‌ను ఎంతో బాధిస్తాయి. అలాంటి వ్యక్తులు జీవిత భాగ‌స్వాములైతే జీవితం న‌ర‌కంలా మారుతుంది. కాబ‌ట్టి జీవిత భాగ‌స్వామిని ఎంచుకునే ముందు ఒక‌టికి రెండు సార్లు బాగా ఆలోచించాలి. ముఖ్యంగా ఈ కింద పేర్కొన్న ఐదు ర‌కాల వ్యక్తులను అస్సలు వివాహం చేసుకోవ‌ద్దు.

1. సీక్రెట్స్‌ దాచేవాళ్లు

కొంతమందికి ర‌హ‌స్యాలు దాచిపెట్టడం అల‌వాటు. ర‌హ‌స్యాలు దాయ‌డం కోసం నిత్యం అబ‌ద్దాలు చెబుతుంటారు. అలాంటి వారిని పెండ్లి చేసుకుంటే జీవితంలో క‌ష్టాలు కొని తెచ్చుకున్నట్టే. ఎందుకంటే ఈ ల‌క్షణం ఉన్నవారు జీవితాల‌ను త‌ల‌కిందులు చేసే ర‌హ‌స్యాల‌ను కూడా చెప్పకుండా దాచేస్తారు. దాంతో తీవ్ర అన‌ర్ధాలు జ‌రిగే ప్రమాదం ఉంది. అలాంటి వారిని పెండ్లి చేసుకునే వారు జీవితంలో ఎన్నో ఎత్తుప‌ల్లాల‌ను చ‌విచూడాల్సి వ‌స్తుంది. పైగా ఇలా అబద్దాలు చెప్పేవారికి రానురాను అబ‌ద్దాలు చెప్పడం ఒక అల‌వాటుగా మారిపోతుంది.

2. వంచ‌న చేసేవాళ్లు

కొంద‌రు ఉద్దేశ‌పూర్వకంగా మ‌న‌తో ఒక‌టి చెబుతూ మ‌రొక‌టి చేస్తారు. ఇలాంటి వారిని వంచ‌కులు అంటారు. ఇలా వంచించేవాళ్లు ఎప్పుడూ ఎదుటివాళ్లలో మంచిత‌నాన్ని గుర్తించ‌లేరు. వాళ్లు ఏది చేసినా క‌రెక్టే అని స‌మ‌ర్థించుకుంటారు. కానీ ఎదుటివాళ్లు అదే ప‌నిచేస్తే మాత్రం త‌ప్పుప‌డుతారు. పెండ్లి అనేది కేవ‌లం ఒక సంద‌ర్భం కాదు. ఒక జీవితం. కాబ‌ట్టి అలాంటి వ్యక్తిని అస్సలు పెండ్లి చేసుకోవ‌ద్దు. చేసుకున్నారంటే జీవితాన్ని చేజేతులా న‌ర‌కంలా మార్చుకున్నట్టే.

3. ఎప్పుడూ ఏడ్చేవాళ్లు

కొంత‌మంది ఎప్పుడూ ఏడుస్తుంటారు. ఎప్పుడూ ప్రతికూల ఆలోచ‌న‌లు చేస్తుంటారు. ఇలాంటి వారు గ‌తంలో ఎవ‌రైనా త‌మ‌ను బాధ‌పెట్టిన విష‌యాన్ని అస్సలు మ‌ర్చిపోరు. ప‌దేప‌దే అదే త‌లుచుకుని కుమిలిపోతుంటారు. పోనీ వాళ్ల బాధ‌ల‌ను వాళ్ల ద‌గ్గ‌ర ఉంచుకుంటారా అంటే అదీ లేదు. ఎప్పుడూ ఎదుటివాళ్లకు చెబుతూ విసిగిస్తుంటారు. అంతేగాక ఇలాంటి వాళ్లు ఏ పొర‌పాటు చేసినా అది త‌మ పొర‌పాటుగా ఒప్పుకోరు. గ‌తంలో త‌మ‌కు అలా జ‌రుగ‌డంవ‌ల్లే ఇప్పుడు ఇలా చేయాల్సి వ‌చ్చిందంటూ స‌మ‌ర్థించుకుంటారు.

4. స్వయం వ్యామోహం గ‌లవాళ్లు

కొంద‌రి నోట ఎప్పుడు చూసినా నేను, నాది, నాకు అనే మాట‌లే వినిపిస్తుంటాయి. ఇలాంటి స్వయంమోహిత‌ వ్యక్తుల‌ను కూడా అస్సలు వివాహం చేసుకోవ‌ద్దు. ఈ అవ‌ల‌క్షణం మొద‌ట్లో కొంత ఆస‌క్తిక‌రంగానే అనిపించినా రానురాను విసుగు పుట్టిస్తుంది. ఇలాంటి స్వయం మోహితులు త‌మ‌ను తాము అతిగా ఊహించుకుంటారు. ప్రపంచ‌మంతా త‌మ‌చుట్టే తిరుగుతుంద‌ని భావిస్తారు. త‌మ‌ను తాము ఒక ఆక‌ర్షణ శ‌క్తిగా ఊహించుకుని పొంగిపోతుంటారు. ఈ విశ్వానికే తాము కేంద్ర బిందువుల‌మ‌ని ఫీల‌వుతుంటారు. అలాంటి వ్యక్తిని పెండ్లి చేసుకుంటే నీ గురించి త‌ను ఆలోచించ‌డం సంగ‌తి ప‌క్కన పెడితే.. నీ గురించి నువ్వు కూడా ఆలోచించుకోలేని ప‌రిస్థితి వ‌స్తుంది.

5. ఏదీ స్పష్టంగా చెప్పనివాళ్లు

కొంత‌మంది మ‌న భావోద్వేగాల‌తో ఆడుకుంటారు. ఏదీ స్పష్టంగా చెప్పరు. క్లారిటీ కోసం మ‌ళ్లీమ‌ళ్లీ అడిగినా ప‌ట్టించుకోరు. వాళ్లకు మ‌నం ఏం చేస్తున్నామ‌నేది అన‌వ‌స‌రం. పైగా వాళ్లచుట్టూ వాళ్లు ఒక కంచెను ఏర్పాటు చేసుకుని కాలం వెళ్లదీస్తుంటారు. ఇలాంటి వ్యక్తిని జీవిత‌భాగ‌స్వామిని చేసుకుంటే జీవితం న‌ర‌క‌మే. ఎందుకంటే అలాంటి వారితో ఏ ఆలోచ‌నా పంచుకోలేము. ఏ ప‌నీ ప‌ర్ఫెక్టుగా చేయ‌డం కుద‌ర‌దు. అందుకే ఇలాంటి స్పష్టతలేని వ్యక్తుల‌ను ముందే దూరం పెట్టడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

Brain Size | మనిషి మెదడు సైజు క్రమంగా తగ్గిపోతున్నదా.. పెరుగుతున్న భూతాపమే కారణమా..?

Smart watch | ఖరీదైన బోట్‌ స్మార్ట్ వాచ్‌.. ఆఫర్‌లో కేవలం రూ.1300కే..!

Life style | ఆరోగ్యాన్ని ఆగం చేయడానికి కేవలం మూడు నైట్‌ షిఫ్టులు చాలట..!

Life style | యోని రింగ్‌ను యోనిలో ఎలా ధరిస్తారు.. అది గర్భం రాకుండా ఎలా నిరోధిస్తుంది..?

Sitting jobs | మీది గంటల తరబడి కూర్చునే ఉద్యోగమా.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలకే ప్రమాదం..!