మధ్యప్రదేశ్‌కు 575కోట్లు ఎగవేసిన సోమ్ డిస్టలరీస్‌ : బీఆరెస్ నేత మన్నె క్రిశాంక్‌

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ 575 కోట్ల రుణాలను మధ్యప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కు ఎగవేసిందని బీఆరెస్ నేత మన్నే క్రిశాంక్ ట్విటర్ వేదికగా ఆరోపించారు. అందుకు సంబంధంచిన నోటీస్‌ను ఆయన పోస్టు చేశారు.

మధ్యప్రదేశ్‌కు 575కోట్లు ఎగవేసిన సోమ్ డిస్టలరీస్‌ : బీఆరెస్ నేత మన్నె క్రిశాంక్‌

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ 575 కోట్ల రుణాలను మధ్యప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కు ఎగవేసిందని బీఆరెస్ నేత మన్నే క్రిశాంక్ ట్విటర్ వేదికగా ఆరోపించారు. అందుకు సంబంధంచిన నోటీస్‌ను ఆయన పోస్టు చేశారు. ఇప్పుడు సోమ్ డిస్టలరీస్ కంపనీ తెలంగాణను కూడా దోచుకోవాలని చూస్తుందని , ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్వాగతిస్తుందని ఆరోపించారు. ఆ డీఫాల్ట్ కంపనీ ఇప్పుడు తెలంగాణను దోచుకోవాలనుకుంటున్నారా అని మంత్రి జూపల్లిని ప్రశ్నించారు. నకిలీ మద్యం అమ్మకాల కారణంగా పలువురి చావుకు కారణమవ్వడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం గతంలో సోమ్ డిస్టలరీస్‌ కంపనీపై నిషేధం సైతం విధించిందని క్రిశాంక్ ఇంతకుముందు ఆరోపించారు. కొత్త బ్రాండ్లకు అనుమతులివ్వలేదంటునే ఇప్పటికే 26 బ్రాండ్లు తెలంగాణలో అమ్మకాలకు సిద్దమయ్యాయని , సోమ్ డిస్టిలరీస్, టాయిట్, మౌంట్ ఎవరెస్ట్, ఎగ్గొటికా లాంటి కంపెనీలు కలిసి తెలంగాణలో 26 రకాల కొత్త బీర్లు మార్కెట్లోకి తేనున్నట్లు బీఆరెస్ ఆరోపణలు చేస్తుంది.