విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ 575 కోట్ల రుణాలను మధ్యప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కు ఎగవేసిందని బీఆరెస్ నేత మన్నే క్రిశాంక్ ట్విటర్ వేదికగా ఆరోపించారు. అందుకు సంబంధంచిన నోటీస్‌ను ఆయన పోస్టు చేశారు. ఇప్పుడు సోమ్ డిస్టలరీస్ కంపనీ తెలంగాణను కూడా దోచుకోవాలని చూస్తుందని , ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్వాగతిస్తుందని ఆరోపించారు. ఆ డీఫాల్ట్ కంపనీ ఇప్పుడు తెలంగాణను దోచుకోవాలనుకుంటున్నారా అని మంత్రి జూపల్లిని ప్రశ్నించారు. నకిలీ మద్యం అమ్మకాల కారణంగా పలువురి చావుకు కారణమవ్వడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం గతంలో సోమ్ డిస్టలరీస్ కంపనీపై నిషేధం సైతం విధించిందని క్రిశాంక్ ఇంతకుముందు ఆరోపించారు. కొత్త బ్రాండ్లకు అనుమతులివ్వలేదంటునే ఇప్పటికే 26 బ్రాండ్లు తెలంగాణలో అమ్మకాలకు సిద్దమయ్యాయని , సోమ్ డిస్టిలరీస్, టాయిట్, మౌంట్ ఎవరెస్ట్, ఎగ్గొటికా లాంటి కంపెనీలు కలిసి తెలంగాణలో 26 రకాల కొత్త బీర్లు మార్కెట్లోకి తేనున్నట్లు బీఆరెస్ ఆరోపణలు చేస్తుంది.
మధ్యప్రదేశ్‌కు 575కోట్లు ఎగవేసిన సోమ్ డిస్టలరీస్ : బీఆరెస్ నేత మన్నె క్రిశాంక్
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ 575 కోట్ల రుణాలను మధ్యప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కు ఎగవేసిందని బీఆరెస్ నేత మన్నే క్రిశాంక్ ట్విటర్ వేదికగా ఆరోపించారు. అందుకు సంబంధంచిన నోటీస్‌ను ఆయన పోస్టు చేశారు.

Latest News
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు
పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !
వానల కోసం గాడిదలకు పెళ్లి!
స్థిరంగా బంగారం, వెండి ధరలు