40 Kg IED Defused : మావోయిస్టుల 40కిలోల ఐఈడీ నిర్వీర్యం

ఛత్తీస్‌గఢ్ సుక్మాలో భద్రతా దళాలు 40 కిలోల ఐఈడీని నిర్వీర్యం చేశాయి. మావోయిస్టులు బలగాలను టార్గెట్ చేస్తూ అమర్చగా అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది.

40 Kg IED Defused : మావోయిస్టుల 40కిలోల ఐఈడీ నిర్వీర్యం

విధాత : ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో భద్రతా దళాలు 40 కిలోల ఐఈడీని నిర్వీర్యం చేశాయి. భద్రతా దళాలను టార్గెట్ గా చేసుకుని మావోయిస్టులు ఇక్కడ ఐఈడీ బాంబును అమర్చారు. ఆ మార్గంలో వెలుతున్న భద్రతా బలగాలు అదృష్టవశాత్తు దానిని పసిగట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఐఈడీ నిర్వీర్య ప్రక్రియలో భాగంగా ఎవరికి గాయాలు కాలేదని సమాచారం. ఐఈడీ గుర్తించిన ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం భద్రతా దళాలు కీలక నేతలుగా ఉన్న మావోయిస్టు పార్టీ కొత్త కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పరి తిరుపతి, కేంద్ర కమిటీ కీలక నేత హిడ్మా లక్ష్యంగా ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

రానున్న మార్చి మాసాంతానికి మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ ధాటికి ఇప్పటికే ఈ ఏడాది 270మంది మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేయగా, 680మందిని అరెస్టు చేశారు. మరో 1225మంది లొంగిపోయినట్లుగా కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసిన గణంకాల్లో పేర్కొంది. 2014నుంచి 2024మధ్య కాలంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 126నుంచి 18కి తగ్గిందని..అందులో కేవలం ఆరు జిల్లాలు మాత్రమే తీవ్ర మావోయిస్టు ప్రభావిత జిల్లాలుగా ఉన్నట్లుగా తెలిపింది.