Cyber Agency Warning | పెరుగుతున్న సైబర్‌ మోసాలు.. కీలక సూచనలు చేసిన సైబర్‌దోస్త్‌..!

Cyber Agency Warning | ఇటీవల కాలం సైబర్‌ మోసాలు విపరీతంగా పెరిగాయి. కొత్త కొత్త పద్ధతుల్లో సైబర్‌ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. సైబర్‌ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు సైబర్‌ నేరగాళ్ల బారినపడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. బ్యాంకు ఏటీఎం గడువు ముగిసిందని.. టెలీకాం సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి మాట్లాడుతున్నామని.. ఉద్యోగాల పేరుతో వల వేసి ఖాతాలను లూటీ చేస్తున్నారు.

Cyber Agency Warning | పెరుగుతున్న సైబర్‌ మోసాలు.. కీలక సూచనలు చేసిన సైబర్‌దోస్త్‌..!

Cyber Agency Warning | ఇటీవల కాలం సైబర్‌ మోసాలు విపరీతంగా పెరిగాయి. కొత్త కొత్త పద్ధతుల్లో సైబర్‌ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. సైబర్‌ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు సైబర్‌ నేరగాళ్ల బారినపడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. బ్యాంకు ఏటీఎం గడువు ముగిసిందని.. టెలీకాం సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి మాట్లాడుతున్నామని.. ఉద్యోగాల పేరుతో వల వేసి ఖాతాలను లూటీ చేస్తున్నారు. ఇప్పటికే సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీలు వివిధ మోసాలు, హ్యాకింగ్‌లపై అప్రమత్తం చేస్తూ వస్తున్నాయి.

తాజాగా ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సైబర్‌దోస్త్‌ నిర్దిష్ట ఫైల్‌ ఫార్మాట్‌పై ప్రజలను అప్రమత్తం చేసింది. .exe ఫైల్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్‌ చేయొద్దని సోషల్‌ మీడియా వేదికగా ద్వారా అప్రమత్తం చేసింది. .exe ఫైల్‌ ఫార్మాట్‌లో ఈ-మెయిల్స్‌, వాట్సాప్‌లో ఏవైనా మెసేజ్‌లు వచ్చినా ఎట్టిపరిస్థితుల్లో ఓపెన్‌ చేయొద్దని చెప్పింది. ఏదైనా మీడియా ఫైల్ చివరిలో .exe కనిపిస్తే దాన్ని డౌన్‌లోడ్‌ చేయొద్దని.. క్లిక్‌ చేయద్దని చెప్పింది. ఫైల్స్‌ ఓపెన్‌ చేస్తే సిస్టమ్‌, డివైజెస్‌ హ్యాక్‌ అయ్యే ప్రమాదం ఉంటుందని.. లేకపోతే మాల్వేర్‌ స్టాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్‌ చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు, మెయిల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ నిపుణులు సూచించారు.