Beer Bottles | బీర్ బాటిల్స్ గ్రీన్, బ్రౌన్ కలర్‌లోనే ఎందుకు ఉంటాయో తెలుసా..?
Beer Bottles | స్నేహితులతో సరదాగా బీరు తీసుకోవడం సాధారణ విషయమే. అలాగే, ఏదైనా శుభకార్యాల సందర్భంలోనూ బీర్ తీసుకుంటూ వస్తుంటారు. అయితే, బీరుతో స్వల్ప ప్రయోజనాలున్నా.. అతిగా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలుంటాయి. అయితే, వీటిని పక్కనపెడితే బీర్లు కొనుగోలు చేసే సమయంలో అందరూ ఒక విషయాన్ని గమనించే ఉంటారు. సాధారణంగా బీరు బాటిల్స్ అన్నీ గ్రీన్, బ్రౌన్ కలర్లలో మాత్రమే కనిపిస్తుంటాయి.
Beer Bottles Color | స్నేహితులతో సరదాగా బీరు తీసుకోవడం సాధారణ విషయమే. అలాగే, ఏదైనా శుభకార్యాల సందర్భంలోనూ బీర్ తీసుకుంటూ వస్తుంటారు. అయితే, బీరుతో స్వల్ప ప్రయోజనాలున్నా.. అతిగా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలుంటాయి. అయితే, వీటిని పక్కనపెడితే బీర్లు కొనుగోలు చేసే సమయంలో అందరూ ఒక విషయాన్ని గమనించే ఉంటారు. సాధారణంగా బీరు బాటిల్స్ అన్నీ గ్రీన్, బ్రౌన్ కలర్లలో మాత్రమే కనిపిస్తుంటాయి. బీర్ బ్రాండ్ ఏదైనా బాటిల్స్ మాత్రం ఈ రెండు రంగుల్లో మాత్రమే కనిపిస్తాయి. చాలామంది రెండురంగుల్లో ఎందుకు ఉంటుందని ఆలోచిస్తుంటారు. కానీ, చాలామందికి అసలు విషయం తెలియదు. దీనికి వెనుక ఉన్న కారణాలు తెలుసుకుంటే మాత్రం షాకవుతారు. బీరు తాగడం ఇప్పటి నుంచే అలవాటు లేదు.
ప్రాచీన మెసపటోనియా, సుమేరియన్ నాగరికత కాలం నుంచి బీరును తాగడం అలవాటుగా వస్తున్నది. బీరును తొలినాళ్లలో సాధారణ బాటిల్స్‌లోనే ఉపయోగించే వారు. అయితే, సూర్యరశ్మి కారణంగా బాటిల్స్‌లోని బీరు పాడవుతుండడాన్ని కంపెనీలు గమనించాయి. అలాగే, బీరు వాసన సైతం దారుణంగా వచ్చేది. సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాలకు బీరు పాడవ్వడానికి కారణం కాబట్టి కంపెనీలు బ్రౌన్ కలర్ బాటిల్స్‌ను ఎంచుకున్నాయి. బ్రౌన్ కలర్ యూవీ కిరణాలను లోనికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. దాంతో బాటిల్స్‌లోని బీరుకు ఎలాంటి సమస్య ఉండదు. అయితే, రెండో ప్రపంచ యుద్ధంలో బీరు సీసాలు ఆకుపచ్చగా పెయింట్ మొదలుపెట్టారు.
నిజానికి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రౌన్ సీసాలకు కరువు ఏర్పడింది. ఈ రంగు సీసాలు అందుబాటులో లేకపోవడంతో బీర్ తయారీదారులు మరో రంగును ఎంచుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో బ్రౌన్ కలర్ సీసాల స్థానంలో గ్రీన్ కలర్ సీసాల వినియోగం అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ రెండు రంగులను బీర్ సీసాల కోసం ఉపయోగించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే, ఆ రెండు రంగులను వినియోగించడం వెనుక శాస్త్రీయ కారణాలు సైతం ఉన్నాయి. సూర్యుడి కిరణాలు బాటిల్స్‌పై పడిన సందర్భంలో అందులోని బీర్ ప్రభావితమకుండా ఉండేందుకు ముదురు సీసాలను ఉపయోగిస్తుంటారు. ఆ రెండు రంగులు సూర్యుడి యూవీ కిరణాలతో ప్రభావితమకుండా ఉంటాయని పేర్కొంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram