Raghopur | మళ్లీ ముందంజలోకి తేజస్వి యాదవ్.. పదివేలకుపై ఓట్ల మెజార్టీ
తొలి రౌండ్లలో కొంత వెనుకబడిన ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తన రఘోపూర్ నియోజకవర్గంలో మళ్లీ ముందంజలోకి వచ్చారు.
Raghopur | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న నియోజకవర్గం రఘోపూర్‌లో ఆర్జేడీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ విజయం కోసం పోరాడుతున్నారు. 11 రౌండ్ ముగిసే సమయానికి వెనుకంజలో ఉన్న తేజస్వి.. తాజాగా పది వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. నవంబర్ 6వ తేదీన నిర్వహించిన తొలి విడుత పోలింగ్‌లో ఇక్కడి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. యశువంశి నాయకుడైన సతీశ్.. రఘోపూర్‌లో ఒక బలమైన అభ్యర్థిగా ముందుకు వచ్చారు. ఇదే స్థానం నుంచి తేజస్వియాదవ్ తల్లి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిపై 2010 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థిగా విజయం సాధించారు. తర్వాత ఆయన బీజేపీలో చేరారు.
నిజానికి ఈ స్థానం లాలూ కుటుంబానికి పెట్టని కోటగా చెబుతారు. దశాబ్దకాలంగా ఈ స్థానం నుంచి లాలు కుమారుడు తేజస్వి యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2015, 2020 ఎన్నికల్లో ఇదే సతీశ్‌పై తేజస్వి గెలుపొందారు. ఇక్కడ నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తేజస్వికి ముందు ఆయన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీదేవి (ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రులు) ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. లాలు 1995, 2000 సంవత్సరాల్లలో విజయం సాధించగా.. రబ్రీదవి 2000 సంవత్సరంలో తొలుత ఉప ఎన్నికలో, తదుపరి రెండు వరుస పర్యాయాలు విజయం సాధించారు. రఘోపూర్‌లో 2025 అసెంబ్లీ నియోజకవర్గంలో 64 శాతం ఓటింగ్ నమోదైంది.
Read Also |
Kavitha : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కవిత ట్వీట్ వైరల్ !
Prashant Kishor’s Jan Suraaj Party : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2025: ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ వైఫల్యమెందుకు?
DK Shivakumar : కాంగ్రెస్‌కు కొత్త వ్యూహాలు అవసరం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram