అత్త‌ను ప్రేమించిన అల్లుడు.. ద‌గ్గ‌రుండి పెళ్లి చేసిన మామ‌

ఓ వ్య‌క్తి త‌న అత్త‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఆ ప్రేమ కాస్త శారీర‌క సంబంధానికి దారి తీసింది. అత్త‌, అల్లుడు అన్యోన్యంగా ఉన్న స‌మ‌యంలో మామ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నాడు. అల్లుడికి అత్త మీద ఉన్న ప్రేమ‌ను చూసి.. వారిద్ద‌రికి మామ ద‌గ్గ‌రుండి పెళ్లి చేశాడు.

అత్త‌ను ప్రేమించిన అల్లుడు.. ద‌గ్గ‌రుండి పెళ్లి చేసిన మామ‌

పాట్నా : ఓ వ్య‌క్తి త‌న అత్త‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఆ ప్రేమ కాస్త శారీర‌క సంబంధానికి దారి తీసింది. అత్త‌, అల్లుడు అన్యోన్యంగా ఉన్న స‌మ‌యంలో మామ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నాడు. అల్లుడికి అత్త మీద ఉన్న ప్రేమ‌ను చూసి.. వారిద్ద‌రికి మామ ద‌గ్గ‌రుండి పెళ్లి చేశాడు. ఈ ఘ‌ట‌న బీహార్‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని బంక గ్రామానికి చెందిన సికింద‌ర్ యాద‌వ్(45) భార్య కొన్నేండ్ల క్రితం చ‌నిపోయింది. ఇక త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తీసుకొని త‌న మేన‌త్త గీతా దేవి(55) ఇంటికి వెళ్లాడు. ఇక సికింద‌ర్, గీతాదేవి మ‌ధ్య ప్రేమ చిగురించింది.

అత్త‌, అల్లుడి సంబంధం గురించి మామ దిలేశ్వ‌ర్ దార్వేకు తెలిసింది. ఒక రోజు వారిద్ద‌రిని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నాడు. గ్రామంలో పంచాయితీ పెట్టాడు. త‌న‌కు త‌న అత్త అంటే ఇష్ట‌మ‌ని సికింద‌ర్ తేల్చిచెప్పాడు. అల్లుడి ప్రేమ‌ను చూసి మామ కూడా చివ‌ర‌కు క‌రిగిపోయాడు. మామ దిలేశ్వ‌ర్ ద‌గ్గ‌రుండి గీత‌, సికింద‌ర్‌కు వివాహం జ‌రిపించాడు. గ్రామ పెద్ద‌ల స‌మ‌క్షంలో గీత‌కు అల్లుడు సికింద‌ర్ తిల‌కం దిద్ది వివాహ తంతును ముగించేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.