బెంగాల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు…ప్రాణ భయంతో బీజేపీ అభ్యర్థి పరుగు

బెంగాల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. బీజేపీ అభ్యర్థిపై దాడి జరగగా, భద్రతా సిబ్బంది సహాయంతో ప్రాణ భయంతో పరుగెత్తిన వీడియో వైరల్ అయింది.

విధాత :పశ్చిమ బెంగాల్ లో తొలి విడత అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న పోలింగ్ పలుచోట్ల ఉద్రిక్తతలతో కొనసాగింది. బెంగాల్‌లోని కుమార్‌గంజ్ బీజేపీ అభ్యర్థి సుబేందు సర్కార్‌పై ప్రత్యర్థి టీఎంసీ వర్గీయులు ప్రత్యక్ష దాడికి పాల్పడ్డారు. అతను భద్రతా సిబ్బంది సహాయంతో ప్రాణాలు రక్షించుకునేందుకు వేగంగా పరుగులు తీసినప్పటికి..ప్రత్యర్థులు అటకాయించి మధ్యలో దాడి చేశారు. చివరకు భద్రతా సిబ్బంది దుండగులను ఎదుర్కోవడంతో అభ్యర్థి అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు.  అనంతరం కార్యకర్తులు ఆయనను  ఆసుపత్రిలో చేర్పించారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పశ్చిమ బెంగాల్‌లో తొలివిడత అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా 152 స్థానాల్లో పోలింగ్‌ కొనసాగుతుంది.తొలి విడతలో బెంగాల్ లో 1478 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 3.6 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1.75 కోట్ల మంది మహిళలున్నారు. బెంగాల్‌లో తృణమూల్, బీజేపీ మధ్య ప్రధాన పోరు సాగుతుంది. పోలింగ్‌ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. 29న రెండు విడత బెంగాల్ లోని 142 స్థానాలకుఎ పోలింగ్ పోలింగ్ జరుగనుంది. మే 4న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవి కూడా చదవండి :

పెళ్లీ మండపం నుంచి పోలింగ్ కేంద్రానికి..నూతన వధూవరుల ఓటింగ్ వైరల్
తమిళనాడు ఎన్నికల్లో ‘టినా’ వెరీ స్పెషల్ !

Latest News