Tamil Nadu Results | తమిళనాడులో డీఎంకే విజయ దుందుభి.. బొక్కబొర్లా పడ్డ బీజేపీ
Tamil Nadu Results | దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో పాగా వేయాలనుకున్న భారతీయ జనతా పార్టీ బొక్కబొర్లా పడింది. తమిళనాడులో ఆ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. మొత్తం 39 స్థానాలు ఉన్న తమిళనాడులో అధికార డీఎంకే పార్టీనే 36 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
Tamil Nadu Results | చెన్నై : దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో పాగా వేయాలనుకున్న భారతీయ జనతా పార్టీ బొక్కబొర్లా పడింది. తమిళనాడులో ఆ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. మొత్తం 39 స్థానాలు ఉన్న తమిళనాడులో అధికార డీఎంకే పార్టీనే 36 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అన్నాడీఎంకే అసలు ఒక్క స్థానంలో కూడా లీడింగ్‌లో లేదు. ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కోయంబత్తూరులో అన్నమలై వెనుకంజలో ఉన్నారు. విరుధ్‌నగర్ నియోజకవర్గంలో విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకరన్ ముందంజలో ఉన్నారు.
ఇక తమిళనాడులో ఈసారి మెజార్టీ సీట్లు సాధించాలనుకున్న బీజేపీకి ఈసారి కూడా తీవ్ర నిరాశే ఎదురయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామళై (కోయంబత్తూరు), తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కూడా పోటీలో వెనుకబడిపోయారు.
ఇక కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి భంగపాటు ఎదురయింది. రాష్ట్రంలో మరోసారి తనకు తిరుగులేదని బీజేపీ నిరూపించుకున్నది. ఇప్పటివరకు రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాల్లో బీజేపీ 20 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 8 స్థానాలకే పరిమితమైంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram