Revanth Reddy Attends CWC Meeting In Patna | పాట్నాలో సీఎం రేవంత్ రెడ్డి..కొనసాగుతున్న సీడబ్ల్యుసీ భేటీ
పాట్నాలో సీడబ్ల్యుసీ భేటీ.. రాహుల్, సోనియాతో పాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరు. బీహార్ ఎన్నికల వ్యూహాలు, ఎన్డీఏ వైఫల్యాలపై చర్చ.

విధాత : బీహార్ పాట్నాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యుసీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీడబ్ల్యుసీ సభ్యుడు మంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ లు హాజరయ్యారు. ఏపీ నుంచి పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల, సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీర్ రెడ్డి, పల్లం రాజు, గిడుగు రుద్రరాజులు హాజరయ్యారు.
సీడబ్ల్యుసీ సమావేశాలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాలు, ప్రణాళికలు, దేశంలో ఓట్ల చోరీ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలు..పార్టీ భవిష్యత్ కార్యాచరణ అంశాలపై కీలక చర్చలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడులో సీఎం స్టాలిన్ ‘నీట్’పై నిర్వహించబోయే సమావేశానికి హాజరవుతారు.