Tamil Nadu Elections | తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు ఖరారు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే-కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు ఖరారైంది. డీఎంకే 164, కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.

DMK Congress alliance

Tamil Nadu Elections | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే, మిత్ర పక్షం కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒప్పందం కుదిరింది. మొత్తం 234 స్థానాల్లో మిత్ర పక్షాలకు 70 సీట్లు ఇచ్చి.. మిగతా 164 స్థానాల్లో డీఎంకే బరిలోకి దిగనుంది. ఇందులో డీఎంకే 164, కాంగ్రెస్‌-28 సీట్లలో పోటీ చేయనున్నాయి. కాంగ్రెస్ సీట్లలో పొన్నేరి, ఈరోడ్ ఈస్ట్, విలవన్‌కోడ్, శివకాశి, కారైకుడి మొదలైన స్థానాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా డీఎండీకే -10 స్థానాల్లో పోటీ చేయనుంది. అలాగే వీసీకే-8, సీపీఐ-5, సీపీఎం-5, ఎండీఎంకే -4 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. రెండేసి చొప్పున స్థానాల్లో డీఎంకే గుర్తుపై ఎంఎన్ఎంకే పార్టీ, కేఎండీకే పోటీ చేయనున్నాయి. ఐయూఎంఎల్‌ 2, ఎంజేకే ఎస్‌డీపీఐకు చెరొక సీటు కేటాయించింది.

ఎన్నికల్లో పోటీ చేయనున్న డీఎంకే అభ్యర్థుల తొలి జాబితాను స్టాలిన్‌ విడుదల చేశారు. కొలతూర్‌ నుంచి సీఎం స్టాలిన్‌, చెపాక్‌-ట్రిప్లికేన్‌ నుంచి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ పోటీ చేయనున్నారు. కొయంబత్తూర్‌ సౌత్‌ నుంచి మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీ బరిలోకి దిగుతారు. బోడినాయగనూర్‌ నుంచి పన్నీర్‌సెల్వం పోటీలో ఉన్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 23న జరగనుంది. కౌంటింగ్‌ మే 4న నిర్వహిస్తారు.

2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాలు సాధించి స్వంతంగానే అధికారం ఏర్పాటు చేసింది. మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ 25 సీట్లలో పోటీ చేసి 18 స్థానాల్లో గెలిచింది. పీఎంకే 5 సీట్లు, వీసీకే 4, ఇతరులు 8 స్థానాల్లో గెలుచుకున్నాయి. డీఎంకే నేతృత్వంలోని కూటమి మొత్తం 159 సీట్లు సాధించింది. గత ఎన్నికలతో పోల్చితే ఈ ధఫా కాంగ్రెస్ కు మూడు సీట్లు అధికంగా దక్కాయి.

ఇవి కూడా చదవండి :

మంత్రి పొంగులేటి టార్గెట్ గా మైనింగ్ అక్రమాలపై బీఆర్ఎస్ ఫైర్..మంత్రుల కౌంటర్
ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం మాటున రేవంత్ సోదరుల భూదందా..వైరల్ గా బీఆర్ఎస్ వీడియో

Latest News