ఈ ఐదు ప్రశ్నలకు ఎన్నికల సంఘం జవాబేంటి? : ఎక్స్‌లో రాహుల్‌గాంధీ
ఈసీతో తన పోరాటాన్ని కొనసాగిస్తున్న రాహుల్‌గాంధీ.. ఐదు సవాళ్లు విసిరారు. తనను అఫిడవిట్‌పై సంతకం చేయాలని లేదా క్షమాపణ కోరాలని ఎన్నికల సంఘం సూచించిన నేపథ్యంలో ఆయన ఎక్స్‌లో స్పందించారు. ఈ ప్రశ్నలకు దేశం సమాధానం కోరుతున్నదన్నారు.

EC Vs Rahul | ఓట్ల చోరీ జరుగుతున్నదన్న విమర్శల విషయంలో అఫిడవిట్‌పై సంతకం చేయాలని లేదా క్షమాపణలు కోరాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సవాలుకు కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ గట్టిగా రిటార్టిచ్చారు. ఐదు ప్రశ్నలు సంధిస్తూ వాటికి ఈ దేశం సమాధానం కోరుతున్నదని చెప్పారు. శుక్రవారం బెంగళూరులో నిర్వహించిన ‘ఓటు హక్కుల ర్యాలీ’లో రాహుల్ మాట్లాడారు. రాజ్యాంగాన్ని ఏం చేసైనా సరే రక్షించుకోవాలన్నారు. ఓట్ల చోరీ అనేది రాజ్యాంగానికి నమ్మకద్రోహం చేయడమేనని మండిపడ్డారు. ‘ఎన్నికల సంఘం నా నుంచి అఫిడవిట్ కోరుతున్నది. నేను ప్రమాణం చేయాలని అంటున్నది. పార్లమెంటులో ఈ దేశ రాజ్యాంగంపై నేను ఎప్పుడో ప్రమాణం చేసి ఉన్నాను’ అని రాహుల్ అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లను ఇప్పటికే మూసివేశారని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఈ దేశ ప్రజలు ఈ రోజు తమ వివరాలను ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను అడుగుతున్నారు. కానీ.. కమిషన్ మాత్రం తన వెబ్‌సైట్‌లను మూసివేంది. ప్రజలు వారిని ప్రశ్నించడం మొదలు పెడితే.. మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఎన్నికల సంఘానికి తెలుసు’ అని చెప్పారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ నాయకత్వంలో రాజ్యాంగంపై దాడి జరిగిందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ‘ప్రతి ఒక్కరికీ ఓటు వేసే హక్కు కల్పించిన రాజ్యాంగాన్ని గత ఎన్నికల్లో మేం పరిరక్షించాం. భారత సంస్థలను పక్కకు తోసేసి, ఈ హక్కుపై బీజేపీ గత ఎన్నికల్లో దాడి చేసింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో మా కూటమి విజయం సాధించింది. కానీ.. కొన్ని నెలల వ్యవధిలోనే మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించింది. ఈ ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉండటంతో మేం లోతుల్లోకి వెళ్లి పరిశోధన చేశాం. ఆ (అసెంబ్లీ) ఎన్నికల్లో కోటి మంది కొత్త ఓటర్లు ఓటు వేశారని మేం కనుగొన్నాం. కొత్త ఓట్లు ఎక్కడెక్కడ పెరిగాయో అక్కడ బీజేపీ గెలిచింది’ అని రాహుల్‌గాంధీ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయని కోటి మంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారని తెలిపారు. ‘కొత్త ఓటర్లు పెరిగిన చోట్ల బీజేపీ గెలిచింది. మా కూటమికి వచ్చిన ఓట్లలో తగ్గుదల ఏమీ లేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ని వచ్చాయో అసెంబ్లీ ఎన్నికల్లోనే అన్నే ఓట్లు వచ్చాయి. కొత్త ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పడ్డాయి’ అని రాహుల్ పేర్కొన్నారు.
ఈ ఐదు ప్రశ్నలకు జవాబులేవి?
ఈసీతో తన పోరాటాన్ని కొనసాగిస్తున్న రాహుల్‌గాంధీ.. ఐదు సవాళ్లు విసిరారు. తనను అఫిడవిట్‌పై సంతకం చేయాలని లేదా క్షమాపణ కోరాలని ఎన్నికల సంఘం సూచించిన నేపథ్యంలో ఆయన ఎక్స్‌లో స్పందించారు. ఈ ప్రశ్నలకు దేశం సమాధానం కోరుతున్నదన్నారు.
1. ప్రతిపక్ష పార్టీలకు డిజిటల్ ఓటర్ లిస్ట్ ఎందుకు అందడం లేదు? మీరు ఏం దాయాలని అనుకుంటున్నారు?
2. సీసీటీవీ, వీడియో సాక్ష్యాలను ఎందుకు చెరిపివేశారు? ఎవరి ఆదేశాలతో ఈ పని చేశారు?
3. నకిలీ ఓటింగ్, ఓటరు జాబితాలో అక్రమాలు.. ఎందుకు?
4. ప్రతిపక్ష నేతలను బెదిరించడం, భయపెట్టడం.. ఎందుకు?
5. సూటిగా చెప్పండి.. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి ఏజెంట్‌గా మారిపోయిందా?
ఇవి కూడా చదవండి..
GPT-5 | చాట్ జీపీటీ కొత్త అవతారం.. ‘ప్రొఫెసర్’ జీపీటీ–5 ఆవిష్కరణ
US India Tarrif | అమెరికా సుంకాలపై ధీటుగా భారత్ కౌంటర్
Prakash Raj| ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: ప్రధాని మోదీపై ప్రకాష్ రాజ్ ఫైర్
Rahul Gandhi: బీజేపీతో ఈసీ కుమ్మక్కు