ప్రేమ వ్యవహరాలు వికటించి ఉన్మాదానికి దారితీస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా కర్ణాటకలో ఓ యువతిని ఆమె మాజీ ప్రేమికుడు పట్టపగలు ప్రజలంగా చూస్తుండగా బస్ స్టా ప్ లో దాడి చేసి వేట కొడవలితో నరికి చంపిన ఘటన వైరల్ గా మారింది. కర్ణాటక మంగళూరులో ఈ విషాదం ఘటన చోటుచేసుకుంది. లావణ్య (21) అనే యువతిని నిందితుడైన చేతన్ (22) కొంతకాలంగా ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. అయితే ఆమె అతని ప్రేమను నిరాకరించింది. దీంతో యువతిపై చేతన్ పగ పెంచుకున్నాడు.
కల్లాడ్కలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న లావణ్య ఎప్పటిలాగే డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమైంది. బంత్వాల్ తాలూకా పరిధిలోని బీసీ రోడ్డు కేఎస్ఆర్టీసీ బస్టాండ్ కు చేరుకున్న సమయంలో యువతిపై నిందితుడు చేతన్ కొడవలితో విచక్షణారహితంగా దాడి చేసి నరికి చంపాడు. లావణ్యకు నిందితుడు చేతన్ దూరపు బంధువు కూడా అవుతాడని సమాచారం. అయితే బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తుండగా నిందితుడు యువతిని హత్య చేయడం చూసిన స్థానికులు షాక్ కు గురయ్యారు.
ఏం జరుగుతుంది రా అసలు 💔
కర్ణాటక లో ఘోరం!
మంగళూరులో విషాదం.
లావణ్య (21) అనే యువతిని, ఆమె మాజీ ప్రేమికుడు, పగబట్టి దారుణంగా నరికి చంపాడు.
నిందితుడైన చేతన్ (22) లావణ్యకు దూరపు బంధువు కూడా!
పగతో పట్టపగలు బస్ స్టాప్ వద్ద ఆమెపై దాడి చేసి చంపేసి అక్కడి నుండి పారిపోయాడు.… pic.twitter.com/e7qv01xv0a
— Chill Bro 😎 (@Cheppu_Mestri) July 17, 2026
