Kempegowda Airport | కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం.. ముమ్మరంగా తనిఖీలు..!

Kempegowda Airport | బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ సిబ్బంది భవనంలోని విశ్రాంతి గదిలోని ఫోన్‌కు బుధవారం ఉదయం బెదిరింపు కాల్‌ వచ్చింది.

  • By: Thyagi |    national |    Published on : May 29, 2024 5:20 PM IST
Kempegowda Airport | కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం.. ముమ్మరంగా తనిఖీలు..!

Kempegowda Airport : బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ సిబ్బంది భవనంలోని విశ్రాంతి గదిలోని ఫోన్‌కు బుధవారం ఉదయం బెదిరింపు కాల్‌ వచ్చింది.

దాంతో కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆల్ఫా 3 బిల్డింగ్‌లోని బాత్రూమ్‌ మిర్రర్‌పై బాంబు పేలుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తి చెప్పాడు. అదేవిధంగా 25 నిమిషాల్లో విమానాశ్రయ నిర్వహణ, సిబ్బంది కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుడు జరుగుతుందని బాత్రూమ్‌ అద్దంపై గుర్తు తెలియని వ్యక్తి రాశాడు.

బెదిరింపు సందేశాన్ని గుర్తించిన విమానాశ్రయ ఉద్యోగి వెంటనే భద్రతాబలగాలను అప్రమత్తం చేశాడు. డాగ్ స్క్వాడ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారులతో సహా భద్రతా సిబ్బంది ఎయిర్‌పోర్టు ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎక్కడా బాంబు ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.