కేర‌ళం మాజీ సీఎం విజ‌య‌న్ నివాసంలో ఈడీ సోదాలు

కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. విజ‌య‌న్ కుమార్తె నివాసంలోనూ ఈడీ సోదాలు కొన‌సాగుతున్నాయి. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఈడీ బృందాలు మొత్తం 12 చోట్ల త‌నిఖీలు చేపట్టాయి. విజ‌య‌న్ కుమార్తె వీణాకు చెందిన కంపెనీ లావాదేవీల‌పై ఆరా తీస్తుంది.

విధాత: కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. విజ‌య‌న్ కుమార్తె నివాసంలోనూ ఈడీ సోదాలు కొన‌సాగుతున్నాయి. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఈడీ బృందాలు మొత్తం 12 చోట్ల త‌నిఖీలు చేపట్టాయి. విజ‌య‌న్ కుమార్తె వీణాకు చెందిన కంపెనీ లావాదేవీల‌పై ఆరా తీస్తుంది.

కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ 2018-2019 మధ్యకాలంలో మాజీ సీఎం విజయన్ కుమార్తె టి.వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి ఎలాంటి సేవలు అందించలేదు. అయినప్పటికీ సీఎమ్ఆర్ఎల్ కంపెనీకి రూ.1.72 కోట్లు అక్రమంగా చెల్లించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, 2024లో ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ కేసు దాఖలు చేసింది. ఈ కేసులో ఈడీ విచారణను రద్దు చేయాలని కోరుతూ సీఎంఆర్ఎల్ సంస్థ కేరళం హైకోర్టును ఆశ్రయించింది.

నిన్న (మంగళవారం) విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సీఎంఆర్ఎల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. కోర్టు తీర్పునిచ్చిన మరుసటి రోజే ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. తిరువనంతపురంలోని విజయన్ అద్దె ఇంటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 10 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.

గ‌తంలోనే ఈ ఆరోప‌ణ‌ల‌కు పిన‌ర‌యి విజ‌యన్ కౌంట‌ర్ ఇచ్చారు. త‌న భార్య ప‌ద‌వీ విర‌మ‌ణ నిధుల‌తోనే త‌న కుమార్తె కంపెనీ ప్రారంభించంద‌న్న విజ‌య‌న్ అప్పట్లో వివరణ ఇచ్చారు. అయితే ఈడీ తన దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహిస్తుంది.

Latest News