విధాత : మహారాష్ట్రలోని పుణెలో కాబోయే భర్త, ప్రముఖ పారిశ్రామివేత్త కేతన్‌ను ప్రియుడితో కలిసి సియా గోయల్ లోహగఢ్ కోటపై నుంచి తోసేసి హత్య చేసిన ఘటన రేపిన సంచలనం తెలిసిందే. కేతన్ హత్యకు గురైన లోహగఢ్ కోట ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించడంతో పర్యాటకులు దానిని చూసేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. చారిత్రకమైన లోహగఢ్ కోటను సందర్శించే పర్యాటకుల సంఖ్యలో సుమారు 25 శాతం పెరుగుదల నమోదైంది. కాబోయే భర్త కేతన్‌ను సియా గోయల్ లోహగఢ్ కోటపై నుంచి తోసి చంపేసిన ప్రాంతం “సియా గోయల్ పాయింట్(సియా స్పాట్)” గా మారిపోగా..ఆ ప్రదేశాన్ని చూపించాంటూ సందర్శకులు గైడ్‌లను అడుగుతుండటం ఆసక్తికరం.
విషాదకరమైన లేదా నేరాలు జరిగిన ప్రదేశాలను చూడాలనే ఆసక్తిని ‘డార్క్ టూరిజం’ అంటారు. ప్రస్తుతం లోహగఢ్ లో ఈ తరహా పర్యాటకులు పెరిగిపోవడం విస్మయకరం. వర్షాకాలంలో, వారాంతంలో ఈ కోటను 10 వేల మంది వరకు, మామూలు రోజుల్లో 800 నుంచి వెయ్యి మంది వరకు పర్యాటకులు సందర్శిస్తుంటారు. కేతన్ ఘటన జరిగిన తర్వాత మరాఠా వారసత్వానికి, వర్షాకాలంలో ప్రకృతి రమణీయతతో ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి చెందిన ఈ కోటకు అనూహ్యంగా పర్యాటకుల సంఖ్య పెరిగిందని అధికారులు వెల్లడించారు. కేతన్ మర్డర్ కేసులో పోలీసులు హత్య సీన్‌ను నిందితురాలు సియాగోయల్ తో రీక్రియేట్ చేసి వివరాలు సేకరించారు.
#viralvídeo పూణేలో కాబోయే భర్త కేతన్‌ను సియా గోయల్ లోహగఢ్ కోటపై నుంచి తోసి చంపిన ఘటన తర్వాత టూరిస్టుల సంఖ్య 25% పెరిగిందట. సందర్శకులు గైడ్‌లను “సియా గోయల్ పాయింట్” ఎక్కడో చూపించమని అడుగుతున్నారట. pic.twitter.com/Ocqx32Hm3d
— TG Govt Updates (@TGGovtUpdates) July 1, 2026
