MP Jayabachchan | మహిళకు భర్త పేరు లేకుండా గుర్తింపు ఉండదా … రాజ్యసభలో ఎంపీ జయబచ్చన్ అసహనం
రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ అసహనానికి లోనయ్యారు. భర్త పేరు జోడించి పిలిచినందుకు ఆమె అయిష్టతను వ్యక్తం చేశారు. ఈ ఘటన సోమవారం రాజ్యసభలో జరిగింది.

విధాత, హైదరాదాబాద్ : రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ అసహనానికి లోనయ్యారు. భర్త పేరు జోడించి పిలిచినందుకు ఆమె అయిష్టతను వ్యక్తం చేశారు. ఈ ఘటన సోమవారం రాజ్యసభలో జరిగింది. రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్.. జయా బచ్చన్‌ను మాట్లాడాలని కోరుతూ.. శ్రీమతి జయా అమితాబ్ బచ్చన్ జీ అని పిలిచారు. ఆ సమయంలో మాట్లాడేందుకు లేచిన జయా బచ్చన్ కొంత ఆవేశానికి గురయ్యారు. సర్,కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందని ఆమె అన్నారు. భర్త పేరుతోనే మహిళకు గుర్తింపు వస్తుందా అని ఆమె ప్రశ్నించారు. మహిళలకు స్వంతంగా ఉనికి లేదా వాళ్లు స్వంతంగా ఏమీ సాధించలేరా అని బచ్చన్ అడిగారు. పార్లమెంట్ రికార్డుల్లో పూర్తి పేరు రాసి ఉందని, అందుకే జయా అమితాబ్ బచ్చన్ అని పిలువాల్సి వచ్చిందని డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్ వివరణ ఇచ్చారు. ఇది చాలా కొత్తగా ఉందని, భర్త పేరుతోనే మహిళకు గుర్తింపు వస్తుందా అని ఆమె ప్రశ్నించారు. మహిళలకు స్వంతంగా ఉనికి లేదా వాళ్లు స్వంతంగా ఏమీ సాధించలేరా అని బచ్చన్ అడిగారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. ఢిల్లీ కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మరణించిన ఘటనను గుర్తు చేశారు. అది చాలా బాధాకరమైన అంశమన్నారు. దీంట్లో రాజకీయాన్ని తీసుకురావద్దు అన్నారు.