PM Modi  Files Nomination | తన భార్య ఆదాయం ఎంతో తెలియని మోదీ

తన భార్య పేరు జశోదాబెన్‌ అని, ఆమెకు వచ్చే ఆదాయం గురించి తెలియదని రాశారు. ఆమె వృత్తి లేదా ఉద్యోగం అన్న చోట కూడా ‘తెలియదు మోదీ నామినేషన్‌ పత్రాల్లో పేర్కొన్నారు

  • By: Tech |    national |    Published on : May 14, 2024 11:03 PM IST
PM Modi  Files Nomination | తన భార్య ఆదాయం ఎంతో తెలియని మోదీ

వడోదర: తనకు 3.02 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రధాని నరేంద్రమోదీ తన నామినేషన్‌ పత్రాల్లో పేర్కొన్నారు. తనకు సొంత కారు, ఇల్లు లేవని తెలిపారు. చేతిలో రూ.52,920 నగదు ఉన్నట్టు మోదీ నామినేషన్‌ పత్రం పేర్కొంటున్నది. దీనికితోడు బ్యాంకు డిపాజిట్ల రూపంలో రూ.2.85 కోట్లు ఉన్నట్టు తెలిపారు. 2.67 లక్షలు విలువ చేసే గోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్ ఉన్నట్టు పేర్కొన్నారు. తనకు ఎలాంటి అప్పులు లేవని, ప్రభుత్వం నుంచి వచ్చే వేతనం, బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ తన ఆదాయ వనరులుగా చూపారు. తాను గుజరాత్‌ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టాపొందానని, 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడిని అయ్యానని తెలిపారు. 1967లో ఎస్సెస్సీ పాస్‌ అయినట్టు పేర్కొన్నారు. తన భార్య పేరు జశోదాబెన్‌ అని, ఆమెకు వచ్చే ఆదాయం గురించి తెలియదని రాశారు. ఆమె వృత్తి లేదా ఉద్యోగం అన్న చోట కూడా ‘తెలియదు’ అని ఉన్నది.