న్యూఢిల్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఓటేసిన రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఏడు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోలింగ్ కొన‌సాగుతోంది. న్యూఢిల్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు

న్యూఢిల్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఓటేసిన రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఏడు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోలింగ్ కొన‌సాగుతోంది. న్యూఢిల్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ కాంప్లెక్స్‌లోని డాక్ట‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్ కేంద్రీయ విద్యాల‌యంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో రాష్ట్ర‌ప‌తి ఓటేశారు. ఈ బూత్‌ను పింక్ బూత్‌గా అధికారులు వ‌ర్ణించారు. ఎందుకంటే ఈ పోలింగ్ బూత్‌లో ఉన్న సిబ్బంది అంతా మ‌హిళ‌లే.

ఢిల్లీలోని చాందీని చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీకి ఓటింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఈ ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది. ఆ స‌మ‌యం వ‌ర‌కు క్యూలైన్ల‌లో నిల్చున్న‌వారికి ఓటేసేందుకు అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు అధికారు.