నటుడు పార్దీబన్ కు ‘నో కాస్ట్ – నో రిలీజియన్’ సర్టిఫికేట్..హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
తమిళ నటుడు ఆర్. పార్థీబన్(R.Parthiban)‘నో కాస్ట్ - నో రిలీజియన్’ సర్టిఫికేట్ కోసం వేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టుసంచలన నిర్ణయం ప్రకటించింది. హైకోర్టు పార్థీబన్ వాదనకు అనుకూల తీర్పు ఇచ్చింది. ఏప్రిల్ 29లోపు ఆయనకు ‘నో కాస్ట్ - నో రిలీజియన్’ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పార్తిబన్ హర్షం వ్యక్తం చేశారు.
విధాత : తమిళ నటుడు ఆర్. పార్థీబన్(R.Parthiban)‘నో కాస్ట్ – నో రిలీజియన్’ సర్టిఫికేట్ కోసం వేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టుసంచలన నిర్ణయం ప్రకటించింది. హైకోర్టు పార్థీబన్ వాదనకు అనుకూల తీర్పు ఇచ్చింది. ఏప్రిల్ 29లోపు ఆయనకు ‘నో కాస్ట్ – నో రిలీజియన్’ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పార్తిబన్ హర్షం వ్యక్తం చేశారు. కులం ఆధారంగా వచ్చే ప్రయోజనాలు అవసరం లేదు… నా కష్టం నేనే నమ్ముతాను” దాని ఆధారంగానే అవకాశాలు..జీవితాన్ని పొందుతానంటూ పార్థీబన్ స్పష్టం చేస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ వేడుకలో రేగిన కుల వివాదం
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా వేడుకలో పార్తిబన్ తన సామాజికవర్గం పేరును వెల్లడించడాన్ని నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శించారు. వేడుకలో ఆయన తనను తాను ‘నేను రాధాకృష్ణన్ పార్తిబన్, ఒక నాయుడు అబ్బాయిని’ అని పరిచయం చేసుకున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో.. స్పందించిన పార్థీబన్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. తాను కులాన్ని, మతాన్ని పట్టించుకోనన్నారు. తన మాతృభాష తెలుగు అని చెప్పడానికి బదులుగా పొరపాటున వేదికపై సామాజికవర్గం పేరును వాడానని తెలిపారు. దీనిని పలువురు విమర్శించడం తనకు తీవ్రంగా బాధ పెట్టిందన్నారు.
ఈ వివాదానికి ముగింపు పలకడమే కాకుండా సమాజానికి ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో సంచలన నిర్ణయం తీసుకున్నానని, ‘నో క్యాస్ట్ నో రిలీజియన్’ సర్టిఫికెట్ తీసుకోవచ్చనే విషయం తెలిసి, దాని కోసం దరఖాస్తు చేశానని తెలిపారు. సర్టిఫికెట్ వస్తే సినీ పరిశ్రమలో దానిని తీసుకున్న తొలి వ్యక్తి తానే అవుతానన్నారు.
ఈ సర్టిఫికెట్ పొందడం గురించి ప్రజల్లోనూ అవగాహన కల్పించి దీనిని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తానని వెల్లడించారు. అనుకున్నట్లుగా ఆయన ‘నో క్యాస్ట్ నో రిలీజియన్’ సర్టిఫికెట్ పొందడం ఆసక్తికరంగా మారంది.
సరికొత్త సమాజానికి రోడ్ మ్యాప్ అవుతుందా..?
ఇప్పుడు పార్థీబన్ కేసు వ్యవహారం తమిళనాడుతో పాటు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కులాల ఆధిపత్యం కొనసాగే భారతీయ సమాజంలో పార్థీబన్ సాధించిన న్యాయపరమైన విజయంతో ‘నో కాస్ట్ – నో రిలీజియన్’ సర్టిఫికేట్ కోరే వారి సంఖ్య పెరుగవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామం సమాజానికి సరికొత్త బలమైన సందేశంగా మారవచ్చన్న చర్చకు తెరలేపింది.
తెలంగాణలో ‘నో క్యాస్ట్’ కేటగిరీని 12 లక్షల మంది!
తెలంగాణలో ‘నో క్యాస్ట్’ కేటగిరీని 12 లక్షల మంది ఎంచుకున్నారు. వీరు రాష్ట్రంలో అత్యధిక జనాభా సంఖ్య ఉన్న జాబితాలో 10వ స్థానంలో నిలిచారు. నో క్యాస్ట్ కేటగిరీ ఓ కమ్యూనిటీ’గా గుర్తింపు పొందడంతో పాటు 3.55 కోట్ల సర్వే జనాభాతో సర్వేలో 3.4 శాతంగా నిలిచారు. తెలంగాణ కుల సర్వేలో ‘కులం లేదు’ లేదా ‘కుల రహిత’అనేది సాంప్రదాయక కులం లేదా మతంతో తమను తాము గుర్తించుకోవడానికి ఇష్టపడని వ్యక్తుల కోసం ఉద్దేశించిన కాలమ్ ను పెట్టారు. ఇది వారి గుర్తింపును ‘కులం లేదు’లేదా ‘మతం లేదు’అని స్పష్టంగా నమోదు చేయడానికి అనుమతిస్తుంది.
‘కులరహిత’అని చెప్పుకున్న వారిలో 73% కంటే ఎక్కువ మంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో, ముఖ్యంగా సంపన్న పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండటం విశేషం. భారత రాజ్యాంగంలోని వ్యక్తిగత స్వేచ్ఛ (ఆర్టికల్ 25) ఆధారంగా, ఎటువంటి కులాన్నీ, మతాన్నీ అనుసరించకుండా అన్ని మతాలను, కులాలను వారి మనోభావాలను సమదృష్టి తో గౌరవించేవారిని ‘నో క్యాస్ట్’ కేటగిరీగా పరిగణిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram