అదృష్టం అంటే వారిదేనంటున్నారు వారికి దొరికిన వజ్రాలను చూసిన వారంతా. ఒకసారి వజ్రం దొరికితేనే దశ తిరిగిందటూ దక్కిన అదృష్టానికి మురిసిపోతుంటారు. అయితే మధ్యప్రదేశ్ లోని పన్నాలో ఓ గిరిజన రైతు కుటుంబానికి ఏకంగా రెండుసార్లు వజ్రాలు దొరికాయి. గతంలో రూ.93 లక్షల విలువైన వజ్రాన్ని కనుగొన్న ఈ కుటుంబం, తాజాగా 11.19 క్యారెట్ల విలువైన మరో వజ్రాన్ని వెతికి పట్టుకుంది. పన్నా జిల్లా అంతర్జాతీయంగా వజ్ర నిక్షేపాలకు ప్రసిద్ధి. వజ్రాలు దొరికే పన్నా జిల్లా అహిర్‌గావ్ ప్రాంతంలో రాకేశ్ ఆదివాసి, ఆయన ముగ్గురు సోదరులు, మరికొందరు బంధువులు కలిసి గత ఏప్రిల్‌లో వజ్రాల వేట కోసం కొంత భూమిని లీజుకు తీసుకున్నారు. రెండు నెలల అనంతరం వారికి నాణ్యమైన, ఖరీదైన 11.19 క్యారట్ల వజ్రం దొరికింది. సోమవారం దాని విలువను రూ.30 లక్షలుగా లెక్కగట్టారు. అనంతరం ప్రభుత్వ వజ్రాల కార్యాలయంలో దాన్ని డిపాజిటు చేశారు. త్వరలో దాన్ని వేలం వేయనున్నారు.
ఇదిఇలా ఉండగా…అదే రాకేశ్ కుటుంబానికి రెండేళ్ల క్రితం ఇక్కడే రూ.93 లక్షల విలువైన వజ్రం దొరికింది. దాంతో వారి ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ఈ నేపథ్యంలో వజ్రాల అన్వేషణలో మరోసారి తమ అదృష్టాన్ని పరిక్షించుకోవాలని నిర్ణయించుకుని మళ్లీ కొంత భూమిని లీజుకు తీసుకుని వజ్రాల కోసం వేటను కొనసాగిస్తూ వచ్చారు. వారి కష్టం వృధా పోకుండా తాజాగా మరోసారి వారిని అదృష్టం వరించింది. నెలల తరబడి చేసిన కష్టానికి ఫలితం దక్కడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
And the tribal family got Rs. 51000 as reward. https://t.co/C2YSNpYkGx
— Mohitt Sharma (@mohitKBsharma) June 30, 2026
