ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమాసియా యుద్దంతో దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందంటూ ప్రజలు ఇంధన వనరులు పొదుపు చేయాలని, ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయాలని, ఇంటి నుంచే పని చేయాని సలహాలు ఇవ్వడంపై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రధాని చెప్పిన మాటలు సలహాలు కావు అని, ఆయన పాలనా వైఫల్యాలకు నిదర్శనాలు అని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇంటి నుంచే పని చేయాలని, విదేశీ ప్రయాణాలకు, బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని చెప్పడంపై మండిపడ్డారు.
“దేశమే ప్రథమం, సౌకర్యం కన్నా కర్తవ్యమే ముఖ్యం” అనే మోదీ సందేశంపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల మధ్య మోదీ రాజీపడ్డారని రాహుల్ స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లే ప్రజలను త్యాగాలు చేయమని కోరుతున్నారని విమర్శించారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ప్రొ.కోదండరామ్ కీలక వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో జనగణనలో కులగణన, 42 శాతం రిజర్వేషన్ల వంటి అంశాలపై ప్రకటన చేస్తారని అనుకున్నాం అని, కానీ మోదీ సుభాషితాలు చెప్పి వెళ్లిపోయారని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్ విమర్శించారు. పెట్రోల్ తక్కువ వాడాలి, బంగారం కొనకండి, విదేశీ ప్రయాణాలు చేయకండి, వర్క్ ఫ్రమ్ అంటూ చెప్పేందుకు ప్రధాని ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు అని చురకలేశారు. విభజన హామీలు, తెలంగాణ అభివృద్ధిపైన ప్రధాని తెలంగాణ పర్యటనలో స్పష్టత వస్తుందని అనుకున్నాం కానీ నిరాశే మిగిలింది అని విమర్శించారు.
ప్రధాని దేశ ప్రజలకు హితవు చెప్పేందుకు దూరదర్శన్ వంటి మాధ్యమాలతో, మీడియా సమావేశాలతో చెప్పవచ్చని, హైదరాబాద్ కు వచ్చి సభ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ అభివృద్దిపై స్పష్టత ఇవ్వకుండా, కొత్తగా ఏమి చెప్పకుండా మావోయిస్టులను మేమే నిర్మూలించామంటూ చెప్పి అసందర్బ మాటలు మాట్లాడారని, మోదీ ప్రసంగం అర్థం పర్థం లేకుండా సాగిందని కోదండరామ్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి :
జర్నలిస్టుల ఇళ్లపై జూన్ 2 లోపు నిర్ణయం : సీఎం రేవంత్ రెడ్డి
మాజీ సీఎం స్టాలిన్ తో సీఎం విజయ్ భేటీ
