ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్

ఢిల్లీ ఎర్రకోట వద్ద గతేడాది జరిగిన కారు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ(NIA) మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అధికారులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

ఢిల్లీ ఎర్రకోట వద్ద గతేడాది జరిగిన కారు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ(NIA) మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అధికారులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 7,500 పేజీల్లో 10 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేశారు. ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. 588 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించినట్లు పేర్కొంది.

నవంబర్ 10, 2025న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు ఘటనలో 15 మంది మృతి చెందారు. ఈ ఘటన వెనుక జిహాదీ కుట్ర కోణం ఉన్నట్లు ఫోరెన్సిక్, సాంకేతిక ఆధారాలు స్పష్టం చేశాయని, నిందితులకు అల్-ఖైదా అనుబంధ సంస్థతో సంబంధం ఉందని ఎన్ఐఏ తన ఛార్జ్‌షీట్‌ లో వెల్లడించింది.

ఇవి కూడా చదవండి :

ఏపీ కేబినెట్ పొదుపు మంత్రం
ఏడాదికి రూ.1.6 కోట్ల జీతం..తిరస్కరించి తల్లిదండ్రుల సేవలో!

Latest News