వందే భారత్ ట్రాక్‌పై రాడ్లు, రాళ్లు.. లోక్ పైలట్ అప్రమత్తతో తప్పిన పెను ముప్పు

విధాత, వందే భారత్ రైలు వెళ్లే మార్గంలో ట్రాక్‌పై అడ్డంగా ఇనుపరాడ్లు, రాళ్లు అడ్డు పెట్టడాన్ని లోకో పైలట్ గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. రాజస్థాన్‌లోని భిల్వాడా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సోమవారం ఉదయం 7.50గంటలకు ఉదయ్‌పూర్ నుంచి జైపూర్ వెలుతున్న వందే భారత్ రైలు 9.55గంటల సమయంలో రాజస్థాన్‌లోని భిల్వాడా రైల్వే స్టేషన్ సమీపంలో చేరుకుంటుండగా రైల్వే ట్రాక్‌పై రాళ్లు పేర్చి ఉండటాన్ని లోక్ పైలట్లు గమనించారు. వెంటనే ఎమర్జన్సీ బ్రేక్‌లు వేసి రైలును నిలిపివేయడంతో రైలులోని వేల మంది ప్రయాణికులకు ముప్పు తప్పింది.
అనంతరం రైలు దిగి పట్టాలను పరిశీలించగా అక్కడ రాళ్లతో పాటు ఇనుప రాడ్లను కూడా పెట్టడం చూసి అవాక్కయ్యారు. వెంటనే సదరు సమాచారాన్ని రైల్వే అధికారులుకు అందించారు. రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దుశ్చర్యను ఆకతాయిల చేశారా లేక కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలతో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.