One Rupee Marriage | వధువే వరకట్నం.. ఒక్క రూపాయితో పెళ్లి చేసుకున్న యువ న్యాయవాది
One Rupee Marriage | ఈ దేశంలో వరకట్నం( Dowry ) వేధింపులకు ఎంతో మంది ఆడబిడ్డలు( Married Woman ) బలైపోతున్నారు. కానీ ఓ యువ న్యాయవాది( Lawyer ) మాత్రం వరకట్నం కింద కేవలం ఒక్క రూపాయి( One Rupee ) తీసుకుని పెళ్లి( Marriage ) చేసుకుని ఈతరం యువత( Youth )కు ఆదర్శంగా నిలిచాడు.

One Rupee Marriage | పెళ్లి( Marriage ) అనగానే ముందు గుర్తు వచ్చేది వరకట్నం( Dowry ). పెళ్లి చూపుల్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఇష్టపడితే.. ఇక కట్నకానుకల గురించి మాట్లాడుకుంటారు. అబ్బాయి అడిగినంత కట్నం ఇచ్చేందుకు అమ్మాయి తల్లిదండ్రులు సిద్ధపడితే.. పెళ్లికి రెడీ అయిపోతారు. ఒక వేళ తాళి కట్టే సమయానికి అడిగినంత కట్నం ఇవ్వకపోతే.. ఆ పెళ్లిని అర్ధాంతరంగా రద్దు కూడా చేసుకున్న ఘటనలు అనేకం. కానీ ఓ యువకుడు( Youth ) మాత్రం కట్నకానుకలకు ఆశపడలేదు. కేవలం ఒక్క రూపాయి( One Rupee )తో పెళ్లి చేసుకున్నాడు. తమకు వధువే( Bride Groom ) వరకట్నం అని చెప్పి అత్తమామలు కట్నం కింద ఇచ్చిన రూ. 31 లక్షలను వివాహ వేదికపైనే తిరిగి ఇచ్చేశాడు ఓ యువ న్యాయవాది( Lawyer ).
ఉత్తరప్రదేశ్( Uttar Pradesh )లోని సహరాన్‌పూర్ జిల్లా భాబ్సి రాయ్‌పూర్ గ్రామానికి చెందిన శ్రీపాల్ రాణా కుమారుడు వికాస్ రాణా( Vikas Rana ) యువ న్యాయవాది( Lawyer ). లాయరే కాదు.. అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి కూడా. రాణా తండ్రి శ్రీపాల్ రాణా రాజకీయ నేత. గత ఎన్నికల్లో బీఎస్పీ టికెట్‌పై యూపీలోని కైరానా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు.
అయితే వికాస్ రాణాకు హర్యానా( Haryana )లోని లుక్ఖి గ్రామానికి చెందిన అగ్రికా తన్వర్‌తో పెళ్లి సంబంధం కుదిరింది. ఏప్రిల్ 30న వికాస్ రాణా, అగ్రికా తన్వర్‌కు పెళ్లి ముహూర్తం కుదిరింది. దీంతో ఆ రోజున వికాస్ రాణా కుటుంబం ఊరేగింపుగా హర్యానాలోని కురుక్షేత్రకు వెళ్లారు. అక్కడున్న ఒక హోటల్‌లో అట్టహాసంగా వివాహ వేడుకకు ఏర్పాట్లు చేశారు. వివాహ వేడుకలో భాగంగా తిలకం వేడుక జరుగుతున్న సమయంలో వధువు తల్లిదండ్రులు..పెళ్లికొడుకు వికాస్ రాణాకు వరకట్నంగా రూ.31 లక్షల నగదును అందజేశారు.
కానీ ఎవరూ ఊహించని విధంగా వికాస్ రాణా గొప్ప మనసు చాటుకున్నాడు. తనకు వరకట్నం కింద ఇచ్చిన రూ. 31 లక్షలను అత్తమామలకు తిరిగి ఇచ్చేశాడు. కేవలం ఒక్క రూపాయి, ఒక కొబ్బరి కాయను కట్నం కింద తీసుకుని పెళ్లి క్రతువు ముగించేశాడు యువ న్యాయవాది. వరకట్నం తీసుకోవడం సామాజిక దురాచారం అని వికాస్ పేర్కొన్నాడు. కట్నం తీసుకోకపోవడం ద్వారా వికాస్ రాణా సభ్య సమాజానికి, ఈతరం యువతకు గొప్ప సందేశాన్ని ఇచ్చారు.