రాజస్థాన్‌ రాష్ట్రంలో ఇసుక తుపాను విరుచుకుపడింది. చురు, బీకానేర్‌ ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులతో నివాస ప్రాంతాలను ఇసుక తుపాన్ ముంచెత్తింది. దీంతో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి.

ఇసుక తుపాను కారణంగా వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇసుక తుపాను అనంతరం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా చుట్టుముట్టిన ఇసుక తుఫాను, బలమైన గాలుల కారణంగా ఈ ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.