పశ్చిమాసియా సంక్షోభాన్ని అధిగమించే నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వినిపించిన పొదుపు మంత్రం అనుసరణ దిశగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా అడుగులు వేసింది. పొదుపు చర్యలు మొదలు పెట్టింది. సోమ, శుక్రవారం పూర్తిగా వర్చువల్ హియరింగ్ విధానంలో కేసులవ విచారణ, 50% రిజిస్ట్రీ సిబ్బంది వర్క్ ఫ్రం హోం పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.
కారు పూలింగ్ విధానాన్ని అనుసరించాలని న్యాయమూర్తులు నిర్ణయించారు. కార్‌పూలింగ్ (Car Pooling) విధానంలో ఒకే మార్గంలో లేదా ఒకే గమ్యస్థానానికి వెళ్లే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకే కారులో కలిసి ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది పెట్రోల్ ఖర్చులను ఆదా చేయడంతో పాటు, ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడానికి, సమయాన్ని ఆదా చేయడానికి దోహదపడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఇవి కూడా చదవండి :
నీట్ పరీక్షలపై మరో కీలక అప్‌డేట్.. ఇకపై మారనున్న పరీక్షా విధానం.. లీకేజీలు తగ్గేనా?
ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోయిన రూపాయి
