Liquor consumption | అధిక మద్యపానం పురుషుల జాబితాలో తెలంగాణకు రెండో స్థానం
దేశంలో కుటుంబ సంక్షేమంపై కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చేసిన సర్వేలో మద్యం వినియోగానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

మొదటి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్
మహిళల్లో నాల్గవ స్థానం
జాతీయ కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సర్వేలో వెల్లడి
Liquor consumption | దేశంలో కుటుంబ సంక్షేమంపై కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చేసిన సర్వేలో మద్యం వినియోగానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మద్యం వినియోగంలో నగరాలకు, పట్టణాలకు మధ్య.. పురుషులకు, స్త్రీలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను ఈ సర్వే వెల్లడించింది. దేశంలో నగరాల్లో కంటే గ్రామాల్లోనే ఎక్కువగా మద్యం సేవిస్తున్నారని సర్వే స్పష్టం చేసింది.
ఇక రాష్ట్రాల వారీగా విభజించబడినప్పుడు దేశంలో అత్యధిక సంఖ్యలో పురుషులు తాగుబోతులుగా ఉన్న రాష్ట్రాలలో అరుణాచల్ ప్రదేశ్ (Arunachal pradesh) మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 52.6% మంది పురుషులు మద్యం ప్రియులు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ (Telangana) ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 43.4% మంది పురుషులు మద్యాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఆ తర్వాత స్థానాల్లో వరుసగా సిక్కిం (39.9%), అండమాన్ (Andaman) (38.8%) మూడో స్థానంలో ఉన్నాయి. తర్వాత స్థానాల్లో వరుసగా మణిపూర్ (37.2%), గోవా (36.8%), ఛత్తీస్‌గఢ్ (34.7%) ఉన్నాయి. అతి తక్కువ మద్యం సేవించే రాష్ట్రాల జాబితాలో లక్షదీప్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 0.4 శాతం మంది పురుషులు మద్యపానం చేస్తున్నారు. తర్వాత స్థానాల్లో గుజరాత్ (5.8%), జమ్మూ & కశ్మీర్ (8.7%), రాజస్థాన్ (11%), మహారాష్ట్ర (13.9%), ఉత్తరప్రదేశ్ (14.5%) ఉన్నాయి.
మహిళల్లోనూ అరుణాచల్ ప్రదేశ్‌దే హవా
ఇక మద్య పానంలో మహిళల పరంగా చూస్తే.. అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్‌లో 24.2% మంది మహిళలు (Womens) మద్యం సేవిస్తున్నారు. తర్వాత స్థానాల్లో సిక్కిం (16.2%), అస్సాం (7.3%), తెలంగాణ (6.7%), జార్ఖండ్ (5.7%), అండమాన్ (5%), ఛత్తీస్‌గఢ్ (4.9%) ఉన్నాయి. దేశంలో 15 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు 18.7%, 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న స్త్రీలలో 1.3% మంది మద్యపానం చేస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలుగా విభజించినట్లయితే.. గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీలలో 1.6% మంది, పట్టణ ప్రాంత స్త్రీలలో 0.6% మంది మద్యం సేవిస్తున్నారు.
పురుషుల విషయానికొస్తే పట్టణ ప్రాంతాల్లో 16.5% మంది, గ్రామీణ ప్రాంతాల్లో 19.9% మంది మద్యం సేవిస్తున్నారు. దేశంలోని ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, ఒడిశాలలో మద్యపానం ఎక్కువగా ఉంది. జాతీయ కుటుంబ సంక్షేమ సర్వేను ప్రతి మూడేళ్లకోసారి నిర్వహిస్తారు. మార్చి 2022లో ప్రచురితమైన ఈ అధ్యయనం 2019 నుంచి 2021 వరకు మూడేళ్ల డేటాను తెలియజేస్తున్నది. తదుపరి అధ్యయనం 2026లో ప్రచురితం కానుంది.