మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..!

మగువలకు పుత్తడి ధరలు షాక్ ఇస్తున్నాయి. వరుసగా రెండోరోజు ఆదివారం ధరలు భారీగా పెరిగాయి. 22 గ్రాముల పసిడిపై రూ.250 పెరిగి తులానికి రూ.52,750 చేరింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.310 పెరిగి తులం రూ.57,540కి పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.52,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.57,690 వద్ద ట్రేడవుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.52,750 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.57,540 పలుకుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి రూ.52,750 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.57,540కి ఎగిసింది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.53,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.58,850కి పెరిగింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పుత్తడి రూ.52,750 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.57,540 వద్ద కొనసాగుతున్నది.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం భారీగా పెరిగాయి. నిన్న స్వల్పంగా తగ్గిన వెండి ఇవాళ పైపైకి కదిలింది. రూ.1500 పెరిగి కిలోకు రూ.72,100కు చేరింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.75వేలు పలుకుతున్నది.