వాళ్లకు పౌరసత్వం ఇస్తే మీకు సమస్య ఏమిటి? అమిత్ షా
కాంగ్రెస్‌కు గాని, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కానీ.. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లో జోక్యం చేసుకునే ధైర్యం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు
కాంగ్రెస్‌కు గాని, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కానీ.. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లో జోక్యం చేసుకునే ధైర్యం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. బెంగాల్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ… ‘బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, బౌద్ధులకు భారత్‌లో పౌరసత్వం ఇస్తే. మీకు వచ్చిన సమస్య ఏమిటి అని ప్రశ్నించారు. తమ రాష్ట్రంలోనే చొరబాటుదారులు ప్రవేశించకుండా అడ్డుకోవాలని బెంగాల్ ప్రజలు కోరుకుంటే, సందేశ్‌ఖాలీ తరహా ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే.. మోడీ మళ్లీ ప్రధానిగా రావాలన్నారు. గత ఎన్నికల్లో మీరు 18 సీట్లు ఇచ్చారు. ప్రతిగా ప్రధాని రామ మందిరం తీసుకొచ్చారు. ఈసారి 35 సీట్లు ఇస్తే చొరబాట్లను ఆపేస్తారని హామీ ఇచ్చారు.
తన ఓటు బ్యాంక్‌పై దృష్టి సారించిన మమతాబెనర్జీ సందేశ్‌ఖాలీలో మహిళల్ని వేధించినా పట్టించుకోలేదు. కానీ హైకోర్టు జోక్యంతో ఇప్పుడు నిందితుడు జైల్లో ఉన్నాడు. బీజేపీకి ఓటు వేయండి. అప్పుడు దీదీ గుండాలు తలకిందులుగా వేలాడుతారు అని అమిత్ షా అన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram