Wife Killed Husband| భార్య చేతిలో మరో భర్త హతం

ఇటీవల ప్రేమించోడి కోసం భర్తలను హత్య చేసిన భార్యల ఉదంతాలు దేశంలో వరుసగా వెలుగుచేస్తున్నాయి. యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలో శశి అనే ఓ మహిళ తన ప్రియుడి కోసం భర్త సునీల్ ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించింది. తాను అనుకున్న పథకం మేరకు ఒక వెబ్‌సైట్ నుండి రూ. 150కి విషం ఆర్డర్ చేసింది

  • By: Subbu |    national |    Published on : Jul 26, 2025 1:22 PM IST
Wife Killed Husband| భార్య చేతిలో మరో భర్త హతం

Wife Killed Husband

విధాత : ఇటీవల ప్రేమించినోడి కోసం భర్తలను హత్య చేసిన భార్యల ఉదంతాలు దేశంలో వరుసగా వెలుగుచూస్తున్నాయి. యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలో శశి అనే ఓ మహిళ తన ప్రియుడి కోసం భర్త సునీల్ ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించింది. తాను అనుకున్న పథకం మేరకు ఒక వెబ్‌సైట్ నుండి రూ. 150కి విషం ఆర్డర్ చేసింది.

పెరుగులో కలిపి భర్త సునీల్‌కు తినిపించింది. అతని ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అతనికి చికిత్స చేసి ఇంటికి పంపారు. తన పథకం బయటకపోవడంతో మరుసటి రోజు మళ్లీ ఆమె కిచ్డీలో విషం కలిపి భర్తకు తినిపించింది. ఈసారి విష ప్రభావంతో సునీల్ ప్రాణాలు విడిచాడు. భార్య కుట్ర తెలియని కుటుంబ సభ్యులు సునీల్ మరణాన్ని సాధారణ మరణంగా భావించి మృతదేహాన్ని దహనం చేశారు.

అయితే భర్తను పథకం మేరకు అడ్డుతొలగించుకున్న శశి ప్రియుడిని ఇంటికి రప్పించుకోవడం మొదలు పెట్టింది. అయితే మృతుడు సునీల్ తల్లి తన కోడలి ప్రవర్తనపై అనుమానం వేసింది. భర్త చనిపోయాడన్న బాధ కనిపించకపోగా…మరో వ్యక్తితో ఇంట్లో గంటల తరబడి గడపడంపై ఆరా తీసింది. ఒకటిన్నర నెలల తర్వాత తన కోడలి ప్రవర్తన బాగా లేదని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేయడానికి పోలీసులు శశి ఇంటికి వెళ్లి సోదాలు చేయగా..భర్తకు పెట్టగా మిగిలిన విషం ప్యాకెట్ గదిలో దొరికింది. దీంతో పోలీసులు శశి వాట్సాప్ చాట్‌ను పరిశీలించారు. ఆమె పొరుగున ఉన్న యాదవేంద్రతో ప్రేమలో ఉందని బయటపడింది. ప్రియుడితో సంబంధం కొనసాగించేందుకే భర్తను శశి హత్య చేసిందని పోలీసులు తేల్చారు. వెంటనే శశిని, యాదవేంద్రను అరెస్టు చేసి రిమాండ్ చేశారు. సునీల్ హత్య కేసులో వారిద్దరు జైలుకు వెళ్లారు.