Viral Video | నాగుపాము పేరు వింటేనే గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. ఎందుకంటే ఆ పాము అత్యంత విషపూరితమైంది. అది కాటేస్తే క్షణాల్లోనే ప్రాణాలు పోతాయి. కానీ కొందరు కోబ్రాలతో ఆటలాడుతారు. అదేదో విషరహిత సర్పం అయినట్టు.. పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఓ యువకుడు కింగ్ కోబ్రాను పట్టుకుని దానికి స్నానం చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ యువకుడు భారీ నాగుపామును పట్టుకుని, తన బాత్రూంలోకి తీసుకెళ్లాడు. అది పడగవిప్పి బుసలు కొడుతుండగా.. దానికి స్నానం చేయించాడు. పాము కరిచేందుకు యత్నించగా, అడ్డుగా మగ్ను పెట్టాడు. ఒకానొక దశలో మగ్ను కూడా పాము తన నోటితో పట్టేసింది. ఇక ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద ఎక్స్‌లో పోస్టు చేశారు. 19 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను 10 వేల మందికి పైగా వీక్షించారు. పాములతో ఆడుకోవద్దని పలువురు నెటిజన్లు హెచ్చరించారు.
Bathing a king cobra