విజయ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం..హాజరైన త్రిష

సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నటి త్రిష హాజరుకావడం హాట్ టాపిక్ గా మారింది. విజయ్ తల్లిదండ్రులతో పాటు త్రిష కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

విధాత : తమిళనాడు నూతన సీఎంగా టీవీకే అధినేత విజయ్ 10గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నెహ్రూ స్టేడియంలో గవర్నర్ విశ్వనాధ్ అర్లేకర్ విజయ్ తో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. విజయ్ తో పాటు 10మంది ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్. ఆనంద్, అధువ అర్జున్, అరుణ్ రాజ్, సెంగొట్టియన్, వెంకటరమణ, నిర్మల్ కుమార్, రాజమోహన్, టీకే. ప్రభు, ఎస్. కీర్తనలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ తన పార్టీ టీవీకే 10మంది ఎమ్మెల్యేలకు తోడు కాంగ్రెస్‌ (5), సీపీఎం(2), సీపీఐ(2), వీసీకే(2), ఐయూఎంఎల్ (2) తో కలిపి మెజార్టీ మార్క్ (118) కంటే అధికంగా 120మంది బలం లభించింది. మూడు రోజుల్లో అంటే ఈ నెల 13వ తేదీలోగా విజయ్ అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ స్పష్టం చేశారు.

విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి నటి త్రిష

సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నటి త్రిష హాజరుకావడం హాట్ టాపిక్ గా మారింది. విజయ్ తల్లిదండ్రులతో పాటు త్రిష కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ కూడా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. 5వేల మందిని స్టేడియంలోకి అనుమతించారు.

Latest News