Viral Video | భర్త కష్టసుఖాల్లో పాలుపంచుకునేది కేవలం భార్య మాత్రమే. భర్తే తన శ్వాస అన్నట్టుగా భార్య జీవిస్తోంది. అలాంటి భర్తకు ఏదైనా కష్టం వస్తే భార్య తట్టుకోలేదు. అతడికి అండగా నిలబడి, మనోధైర్యాన్ని కల్పిస్తుంది. తాను ఉపవాసం ఉండి కూడా తన భర్త కడుపు నింపుతోంది భార్య. ఈ మాదిరిగానే ఓ భార్య తన అన్నాన్ని భర్త ప్లేట్లో వడ్డించి తాను ఏదో కొన్ని మెతుకులు తిని కడుపు నింపుకున్న వీడియో నెట్టింట వైరల్ […]
Viral Video | భర్త కష్టసుఖాల్లో పాలుపంచుకునేది కేవలం భార్య మాత్రమే. భర్తే తన శ్వాస అన్నట్టుగా భార్య జీవిస్తోంది. అలాంటి భర్తకు ఏదైనా కష్టం వస్తే భార్య తట్టుకోలేదు. అతడికి అండగా నిలబడి, మనోధైర్యాన్ని కల్పిస్తుంది. తాను ఉపవాసం ఉండి కూడా తన భర్త కడుపు నింపుతోంది భార్య. ఈ మాదిరిగానే ఓ భార్య తన అన్నాన్ని భర్త ప్లేట్లో వడ్డించి తాను ఏదో కొన్ని మెతుకులు తిని కడుపు నింపుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇద్దరు భార్యాభర్తలు కలిసి భోజనం చేస్తున్నారు. భర్త ఓ వైపు తింటూనే.. మరో వైపు ఫోన్లో మునిగిపోయాడు. తన ప్లేట్లో ఉన్న అన్నం అయిపోతుంది. మళ్లీ వడ్డిద్దామంటే పాత్రలో అన్నం లేదు. దీంతో భార్య తన ప్లేట్లో ఉన్న అన్నాన్ని తన భర్త ప్లేట్లో వేస్తుంది. ఈ విషయాన్ని భర్త గమనించకుండా భోజనం కానిచ్చేస్తాడు. ఇక భార్య ఏవో కొన్ని మెతుకులు తిని కడుపు నింపుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అయితే భర్తల కోసం భార్యలు ఎన్నెన్నో త్యాగాలు చేస్తుంటారు. తన కడుపు మాడ్చుకొని కూడా అతని కడుపు నింపితే.. ఇదేనా మనం ఆడవారికి ఇచ్చే గౌరవం అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఫోన్లో మునిగిపోయాడు కానీ.. తన భార్య తింటుందా..? లేదా..? అన్న విషయాన్ని గమనించకపోవడం దారుణం అని మరికొందరు తిట్టిపోస్తున్నారు.