Bank Holidays in May | మే నెలలో పదిరోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ప్రతి నెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. సెలవులుంటాయో తెలుసుకోవడం మంచిది. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని 10 రోజులు సెలవులు ఉండనున్నాయి.
Bank Holidays in May | మే నెలలో పదిరోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ప్రతి నెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. సెలవులుంటాయో తెలుసుకోవడం మంచిది. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని 13 రోజులు సెలవులు ఉండనున్నాయి. అయితే, బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్నెట్బ్యాంకు, యూపీఐ సర్వీసులు నిరంతరాయంగా పని చేస్తాయి. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు వీలుంటుంది. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉండనున్నాయి. పలు బ్యాంకులు క్యాష్ డిపాజిట్ కోసం మెషిన్లను సైతం అందుబాటులో ఉండగా.. వీటితో అకౌంట్లో డబ్బులు చేసుకునే వీలున్నది. కొన్ని సేవల కోసం బ్యాంకులకు వెళ్లే అవసరం ఉంటుంది. అలాంటి సమాచారం సెలవుల గురించి సమాచారం ఉంటే.. ముందస్తుగానే పనులు చేసుకునే వీలు కలుగుతుంది.
మే 1న కార్మిక దినోత్సవం (అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు)
మే 5న ఆదివారం
మే 8న రవీంద్రనాథ్ జయంతి (కోల్కతాలో బ్యాంకులకు సెలవు)
మే 10న బసవ జయంతి, అక్షయ తృతీయ (బెంగళూరులో సెలవు)
మే 11న రెండో శనివారం
మే 12 న ఆదివారం
మే 13 న తెలంగాణ, ఏపీతోపాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కావడంతో సెలవు
మే 16న సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం (గ్యాంగ్టక్లో బ్యాంకులకు సెలవు)
మే 19న ఆదివారం
మే 20 న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో (బేలాపూర్, ముంబయిలో బ్యాంకులకు సెలవు)
మే 23న బుద్ధ పూర్ణిమ. అగర్తల, ఐజ్వాల్, భోపాల్, బేలాపూర్, డెహ్రాడూన్, ఇటానగర్, చండీగఢ్, జమ్ము, కోల్కతా, లక్నో, ముంబయి, నాగ్పూర్, న్యూఢిల్లీ, రాయ్పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగగ్లో సెలవులు
మే 25న నాల్గో శనివారం
మే 26న ఆదివారం