విధాత : ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో పడవ ప్రమాదం తీవ్ర విషాదం రేపింది. యమున నదిలో పడవ బోల్తాపడిన ఘటనలో 25మంది గల్లంతైనట్లుగా సమాచారం. నదిలో గల్లంతైన వారిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బృందావన్‌లోని కేసీ ఘాట్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో దాదాపు 30 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో చాలా మంది నదిలో మునిగిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ తొమ్మిది మృతదేహాలను వెలికితీసినట్టు తెలుస్తోంది. మరో 14మందిని రక్షించారు.
మధురకు వచ్చిన భక్తులు బృందావన్‌ను సందర్శించిన అనంతరం సుమారు 30 మంది యమునా నదిలో విహారం కోసం ఒక స్టీమర్ బోటు ఎక్కారు. బోటు కేసీ ఘాట్‌కు చేరుకోగానే ఫ్లోటింగ్ వంతెనను ఢీకొట్టడంతో బోల్తాపడి.. అందులో ఉన్న భక్తులందరూ యమునా నదిలో పడిపోయారు.
