విధాత : అతడి వయసు ఏడేళ్లు..అయితేనేం..భయపెట్టే సముద్రపు అలలను తన అసాధారణ సాహసంతో అలవోకంగా అధిగమించి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన ఏడేళ్ల ఇషాంక్ సింగ్ శ్రీలంక నుండి ధనుష్కోడి వరకు ఉన్న 29 కిలోమీటర్ల ప్రమాదకరమైన పాల్క్ జలసంధిని కేవలం 9 గంటల 50 నిమిషాల్లో ఈది అబ్బురపరిచాడు. ఈ ఘనత సాధించిన ‘యంగెస్ట్ స్విమ్మర్’గా యూనివర్సల్ రికార్డ్స్ ఫోరమ్‌లో చోటు సంపాదించాడు. చిన్న వయసులోనే అసాధారణ పట్టుదలతో ఈ సాహసం చేసిన ఈ చిచ్చరపిడుగుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుని దానిని సాధించడం ఎంత గొప్ప విషయమో ఇషాంక్ నిరూపించాడు. మార్గం కఠినంగా ఉన్నా, సముద్రపు కెరటాలు భయపెట్టినా, మనసులో నమ్మకం, దృఢ సంకల్పం ఉంటే అసాధ్యం అనేది ఏదీ లేదని ఆ బాలుడు చాటి చెప్పాడు. అతని అనితర సాధ్యమైన విజయంతో “వయసు కాదు, సంకల్పమే ముఖ్యం” అనే సందేశం మరింత బలంగా మారింది. మనలో ఉన్న సామర్థ్యాన్ని నమ్మితే, ఎంత పెద్ద సముద్రాన్నైనా జయించగలం అన్న స్పూర్తిని అందించిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ஜார்கண்ட் – ராஞ்சி சேர்ந்த 7 வயது இஷாந்த் என்ற சிறுவன், தலைமன்னார் – தனுஷ்கோடி வரையிலான 29 கிலோமீட்டர் பாக் நீரிணையை 9 மணி 50 நிமிடத்தில் நீந்திக் கடந்து சாதனை pic.twitter.com/ARRyVt6tJt
— Kᴀʙᴇᴇʀ – தக்கலை கபீர் (@Autokabeer) May 1, 2026
ఇవి కూడా చదవండి :
Nara Rohit | త్వరలో తండ్రి కాబోతున్న నారా రోహిత్.. శిరీష్ బేబి బంప్ వీడియో వైరల్
Viral News | ఉద్యోగం ఇవ్వలేదని.. కంపెనీలు సర్వనాశనం కావాలని తాంత్రిక పూజలు!
