HYD University | హింసపై గళం విప్పినందుకు కోర్టు కేసు
HYD University హైదరాబాద్ యూనివర్సిటీతో పాటు మరో ఇద్దరికి సమన్లు ఈ నెల24, 28 తేదీలలో హాజరు కావాలని ఇంపాల్ కోర్టు ఆదేశం విధాత ప్రతినిధి: మణిపూర్‌లో జరుగుతున్న హింసపై మాట్లడినందుకు హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌తో పాటు మరో ఇద్దరికి ఇంపాల్ ఈస్ట్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరు చేసిన నేరమల్లా ‘ధ వైర్’ అనే ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వూలు ఇవ్వడమే నేరమైంది. ద వైర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన హైదరాబాదు యూనివర్సిటీ కి చెందిన […]
HYD University
- హైదరాబాద్ యూనివర్సిటీతో పాటు మరో ఇద్దరికి సమన్లు
- ఈ నెల24, 28 తేదీలలో హాజరు కావాలని ఇంపాల్ కోర్టు ఆదేశం
విధాత ప్రతినిధి: మణిపూర్‌లో జరుగుతున్న హింసపై మాట్లడినందుకు హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌తో పాటు మరో ఇద్దరికి ఇంపాల్ ఈస్ట్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరు చేసిన నేరమల్లా ‘ధ వైర్’ అనే ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వూలు ఇవ్వడమే నేరమైంది.
ద వైర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన హైదరాబాదు యూనివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్ ఖమ్ ఖాన్ సుఆన్ లతో పాటు కుకీ ఉమెన్స్ ఫోరమ్ కన్వీనర్ మేరీ గ్రేస్ జూ మరియు కుకీ పీపుల్స్అలియన్స్ జనరల్ సెక్రటరీ అయిన విల్సన్ లలమ్ హాన్సింగ్‌కు సమన్లు జారీ చేసింది.
ఈ నెల 24 ,28 తేదీలలో హాజరు కావాలని ఆదేశించింది. మణిపూర్ హింసాకాండపై ద వైర్ పేపరు తమ సిరిస్ లో భాగంగా జర్నలిస్టు కరణ్ థాపర్ వీరి ముగ్గురిని వేరు వేరు సమయాల్లో ఇంటర్వూ చేశారు. వారు తమ తమ ఇంటర్వూ ల్ల్లో మణిపూర్ లో జరుగుతున్న హింసాకాండను తీవ్రంగా వ్యతిరేకించారు.
అంతేకాదు మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ రాజీనామా చేయాలని కోరారు.. కుకీ సముదాయానికి ప్రత్యేక ప్రభుత్వ విభాగం ఉండాలని డిమాండ్ చేశారు. వీరు ముగ్గురు కుకీ సముదాయానికి చెందిన వారే కావటం విశేషం.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram