విధాత:‘స్నేహశీలీ, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు మడమ తిప్పడు అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం,పేద ప్రజల దైవం మా బావగారైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకుశాంతి కలగాలని ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటున్నాను’అని సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ట్వీట్ చేశారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్, రచయిత కోన వెంకట్, దర్శకుడు గోపిచంద్ మలినేని ట్విటర్ వేదికగా వైఎస్సార్‌కు నివాళులర్పించారు.