KTR| ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు..కాంగ్రెస్ సర్కార్ అసమర్థతకు నిదర్శనం: కేటీఆర్

ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల చెల్లింపులో రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వడానికి ఒక్క పైసా కూడా లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని

KTR| ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు..కాంగ్రెస్ సర్కార్ అసమర్థతకు నిదర్శనం: కేటీఆర్

విధాత, హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు(Fee Reimbursement Dues) ఇవ్వడానికి ఒక్క పైసా కూడా లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government failure)చేతకానితనానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతో(డచ Revanth Reddy government negligence) 13 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. విద్యార్థుల ఫీజుల కోసం లేని డబ్బులు, కమీషన్లు, కాంట్రాక్టులకు మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రభుత్వం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తాము రూ. 20 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులను చెల్లించామన్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన రూ.3వేల కోట్ల రూపాయలను కూడా చెల్లించామన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డబ్బులు లేవన్న సాకుతో పెండింగ్ బకాయిలను ఇవ్వడం లేదని విమర్శించారు. డబ్బులన్నీ ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలకే ఖర్చు అవుతున్నాయి.. రీయింబర్స్‌మెంట్‌కు ఒక్క పైసా కూడా లేదని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క చెప్పడం సిగ్గుచేటు అన్నారు.. కాలేజీల బంద్‌ను ఆపి వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌ నేతల కనుసన్నల్లోనే యూరియా బ్లాక్‌ మార్కెట్‌

ఇక రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న యూరియా కొరత(Fertilizer Shortage) సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణమని కేటీఆర్ ఆరోపించారు. రైతుల కోసం కేటాయించిన యూరియాను కాంగ్రెస్ నాయకులే బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్‌మ్యాన్ ఒక లారీ లోడ్ యూరియాను ఎత్తుకుపోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల యూరియా దోపిడికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ఒక గన్‌మ్యాన్ లారీ లోడ్ యూరియా ఎత్తుకుపోతే ఇక కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఎంత దోచుకుంటున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గత ముఖ్యమంత్రులైన ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్, రోశయ్యలు ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను కేసీఆర్ కొనసాగించారని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే కేసీఆర్ పేరు ఉందన్న ఏకైక కారణంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు. కేసీఆర్ కిట్లు, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాలు అన్నింటినీ ఆపేశారని చెప్పారు. రేవంత్‌ రెడ్డి పాలనలో హైదరాబాద్‌లో క్రైమ్‌ రేట్‌ పెరిగిందన్నారు. జూబ్లీహిల్స్‌ నుంచే మళ్లీ కేసీఆర్‌ జైత్రయాత్ర మొదలవ్వాలని..ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.