క‌రోనా విప‌త్తు నుంచి కాపాడాలి.. సిపిఐ

విధాత‌(గుంటూరు): క‌రోనా విపత్తు నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాల‌ని సిపిఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని కోరారు. ఈ మేర‌కు సీఎంకు లేఖ రాశారు. ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా నాగేశ్వరరావు సతీసమేతంగా చంద్రమౌళి నగర్ లోని త‌న నివాసంలో ఉదయం 10 నుంచి 5 గంటల వరకు దీక్ష లో కూర్చున్నారు. వారికి మద్దతుగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి లు వారివారి గృహాల్లో కుటుంబ […]

  • Publish Date - May 8, 2021 / 05:43 AM IST

విధాత‌(గుంటూరు): క‌రోనా విపత్తు నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాల‌ని సిపిఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని కోరారు. ఈ మేర‌కు సీఎంకు లేఖ రాశారు. ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా నాగేశ్వరరావు సతీసమేతంగా చంద్రమౌళి నగర్ లోని త‌న నివాసంలో ఉదయం 10 నుంచి 5 గంటల వరకు దీక్ష లో కూర్చున్నారు.

వారికి మద్దతుగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి లు వారివారి గృహాల్లో కుటుంబ సభ్యులతో దీక్షలు చేశారు. ఈ సంద‌ర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగి వేలాది మంది మృత్యువాత పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్రభుత్వ , ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల హాస్టల్స్ ను, కళ్యాణ మండపాల‌ను క్వారంటైన్ సెంటర్లుగా ఉపయోగించుకొని బెడ్లు కేటాయించాల‌న్నారు. పోలియో చుక్కల త‌ర‌హాలో వ్యాక్సినేషన్ వేగ‌వంత చేయాల‌న్నారు. మండల కేంద్రాల్లో క్వారంటైన్ సెంటర్లు, పిహెచ్‌సిల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాల‌ని కోరారు. ప్రభుత్వ , పారిశ్రామికవేత్తల ధార్మిక సంస్థల ద్వారా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల‌న్నారు. డాక్టర్లతోపాటు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు, జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ కిట్లు, ప్రోత్సాహలను అందించాల‌న్నారు.

క‌రోనాతో మరణించిన వారి కుటుంబాలకు 50 లక్షల ఎక్స్ గ్రేషియో అందించాల‌ని కోరారు. తక్షణ అవసరంలేని పద్దులను కుదించి ప్రతి జిల్లాకు 3 వందల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించి, కరోనా సేవలు, సదుపాయాలు క‌ల్పించాల‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వ సాయం కోసం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారి సూచనలను తీసుకోవాల‌న్నారు. ఈ అంశాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని సీఎం జ‌న‌గ్‌కు, ప్ర‌భుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, వైద్యశాఖ మంత్రి ఆళ్ల నానికి\, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు.

Latest News