పాకిస్తాన్‌పై.. భారత్ ప్రతీకారం తీర్చుకోవాలి: పెంటగాన్ మాజీ అధికారి రూబిన్

విధాత: పహల్గామ్ ఉగ్ర దాడిని 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మారణహోమంతో అమెరికా పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ పోల్చారు. దానిపై ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకున్నట్లుగానే.. పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని ఆయక సూచించారు. అక్టోబర్ 7న యూదులకు వ్యతిరేకంగా దాడి చేశారని.. ఇప్పుడు పహల్గామ్‌లో హిందువులకు వ్యతిరేకంగా దాడి చేశారని రూబిన్ గుర్తుచేశారు. ఆనాటి ఘటనకు.. పహల్గామ్ ఘటనకు పెద్ద తేడా లేదని.. ఇజ్రాయెల్‌పై జరిగినట్లుగానే.. భారత్‌పై జరిగిందని పేర్కొన్నారు.
హమాస్‌పై ఐడీఎఫ్ దళాలు ఎలా దాడిచేశాయో.. ఇప్పుడే అదే మాదిరిగా భారత్ కూడా చేయాల్సిందేనన్నారు. ఐఎస్ఐను పూర్తిగా భారత్ నాశనం చేయాలని కోరారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రెచ్చగొట్టడం వల్లే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిందని తెలిపారు. దివంగత ఒసామా బిన్ లాడెన్‌కు అసిమ్ మునీర్‌కు పెద్ద తేడా లేదన్నారు. లాడెన్ గృహలో దాక్కుంటే.. అసిమ్ రాజ గృహంలో ఉంటున్నాడని చెప్పారు. ఇద్దరికీ పెద్ద తేడా లేదని పేర్కొన్నారు. ఐఎస్ఐతో సహా దాని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయాలని సూచించారు.