Hyderabad: డ్రగ్స్‌తో పట్టుబడ్డ‌.. ప్ర‌ముఖ హ‌స్పిట‌ల్ సీఈవో!

  • By: sr    news    May 10, 2025 2:09 PM IST
Hyderabad: డ్రగ్స్‌తో పట్టుబడ్డ‌.. ప్ర‌ముఖ హ‌స్పిట‌ల్ సీఈవో!

విధాత, హైదరాబాద్ : ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన వైద్యురాలు డ్రగ్స్ కు బానిసగా మారిపోయి.. నిషేధిత డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడింది. హైదరాబాద్ షేక్ పేట ఏపీఏహెచ్ సీకాలనీకి చెందిన డాక్టర్ చిగురుపాటి నమ్రత ఒమెగా ఆసుపత్రి సీఈవోగా పనిచేస్తున్నారు.

కొన్నాళ్లుగా డ్రగ్స్ కు అలవాటైన నమ్రత డ్రగ్స్ కోసం ముంబైకి చెందిన వంశీ టక్కర్‌ను వాట్సాప్ ద్వారా సంప్రదించి డ్రగ్స్ ఆర్డర్ చేశారు. ఆన్ లైన్ ద్వారా అతడికి డబ్బును పంపించింది. డ్రగ్ పెడ్లర్ టక్కర్ తన డెలివరీ బాయ్ గా పనిచేసే బాలకృష్ణ రాంప్యార్ కు డ్రగ్ ఇచ్చి రాయదుర్గంలోని నమ్రతను కలిసి అందించేలా ఏర్పాటు చేశాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు బాలకృష్ణ రాంప్యార్ నుంచి నమ్రత డ్రగ్స్ తీసుకుంటున్న సమయంలో తన నివాసం అపర్ణ వన్ అపార్ట్ మెంటులో పట్టుకుని అరెస్టు చేశారు. ఈ సందర్బంగా నిందితుల నుంచి 53గ్రాముల నిషేదిత కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.