Posani Krishna Murali: ఎట్టకేలకు.. జైలు నుంచి విడుదలైన పోసాని

విధాత : వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణ మురళి ఎట్టకేలకు గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. న్యాయవాదులు కోర్టు బెయిల్ ఉత్తర్వుల కాపీలను జైలు అధికారులకు అందించారు వాటిని పరిశీలించిన జైలు అధికారులు పోసానిని విడుదల చేశారు. జైలు బయట వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, కార్యకర్తలు పోసానిని పరామర్శించారు. అనంతరం పోసాని కారులో హైదరాబాద్ వెళ్లారు.
వైసీపీ ప్రభుత్వ హయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై చేసిన విమర్శలకు సంబంధించి పోసానిని ఫిబ్రవరి 26న హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు పోసాని పై 18 కేసులు నమోదు అయ్యాయి. వాటన్నింటిలో బెయిల్ లభించింది. సీఐడీ చేసులోనూ బెయిల్ దక్కడంతో పోసాని విడుదల సాధ్యమైంది. ఇకపై నోటీసులు ఇచ్చి పోసాని నుంచి ఆయా కేసుల్లో వివరణ తీసుకోవచ్చు అని కోర్టు స్పష్టం చేసింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీఎఫ్‌టీవీడీసీ చైర్మన్‌గా పనిచేసిన పోసాని కృష్ణమురళి ప్రభుత్వ పెద్దల అండ చూసుకుని అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై అసభ్యకరమైన భాషతో దుర్భాషలాడారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో కూటమి ప్రభుత్వం ఎక్కడ తనను టార్గెట్ చేస్తుందోనని ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఐనప్పటికి కూటమి ప్రభుత్వం పోసానిపై కేసులు పెట్టి జైలుకు పంపించడం గమనార్హం.