Cyber Fraud | సైబర్ మోసాలకు చెక్ పెట్టే యోచనలో కేంద్రం.. ‘కిల్ స్విచ్’ పేరుతో ప్రత్యేక వ్యవస్థ..!
సైబర్ మోసాలకు కేంద్రం 'కిల్ స్విచ్' చెక్! బ్యాంకింగ్ యాప్‌లో ఎమర్జెన్సీ బటన్ ద్వారా మీ నగదు క్షణాల్లో ఫ్రీజ్ చేయొచ్చు. డిజిటల్ అరెస్ట్ బాధితులకు ఇక రక్షణ..
దేశంలో డిజిటల్ అరెస్టులు, సైబర్ మోసాలు పెరిగిపోయాయి. సొమ్ము కాజేసేందుకు నేరగాళ్లు కొత్త కొత్త దారులను వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా డిజిటల్ దాడులకు (Digital Arrest Scams) పాల్పడుతున్నారు. బ్యాంకు ఖాతాల నుంచి చాలా సులువుగా కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. ఫలితంగా సైబర్ మోసాలపై (Cyber Fraud) పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా.. ఎంత అవగాహన కల్పిస్తున్నా ఎవరో ఒకరు ఇంకా ఈ మోసాలకు బలవుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు సైతం కేటుగాళ్ల చేతిలో దారుణంగా మోసపోతున్నారు. రూ.లక్షలు, రూ.కోట్లు పోగొట్టుకుని లబోదిబోమని గుండెలు బాదుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో దేశంలో నానాటికీ పెరిగిపోతున్న సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సైబర్ మోసాలను అరికట్టేందుకు ‘కిల్ స్విచ్’ (Kill Switch) అనే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. బ్యాంకింగ్, యూపీఐ యాప్‌లలో ఎమర్జెన్సీ బటన్‌ను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీని గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు హోం శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. బాధితులకు ఇలాంటి మోసం ఏదో జరుగుతున్నదని అనిపించగానే వెంటనే తమ ఫోన్‌లోనే ‘కిల్ స్విచ్’ను ఉపయోగించి మొత్తం లావాదేవీలను నిలిపివేసేలా వ్యవస్థను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఏమిటీ కిల్ స్విచ్, ఇది ఎలా పనిచేస్తుంది..?
ఈ కిల్ స్విచ్.. మన ఫోన్‌లోని బ్యాంకింగ్ లేదా యూపీఐ యాప్‌లలో ఎమర్జెన్సీ బటన్‌లాగా పనిచేస్తుంది. సైబర్ మెసగాళ్లు మన ఖాతాలను లక్ష్యంగా చేసుకున్నారని లేదా మన ఖాతాల నుంచి మనకు తెలియకుండానే నగదు బదిలీ అవుతున్నట్లు అనిపించగానే ఈ కిల్ స్విచ్ బటన్‌ను ఉపయోగించుకోవచ్చు. డిజిటల్ అరెస్టులకు గురయ్యామని గుర్తించిన వెంటనే బాధితులు ‘కిల్ స్విచ్’ను వినియోగించి వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల్లో ఉన్న తమ అకౌంట్లను నిలుపుదల చేసుకోవచ్చు. తద్వారా వారి అకౌంట్లకు సంబంధించిన అన్ని లావాదేవీలు నిలిచిపోతాయి. అన్ని యూపీఐ, బ్యాంక్ యాప్స్‌లో ‘కిల్ స్విచ్’ ఎమర్జెన్సీ బటన్ ఏర్పాటు చేయనున్నారు.
ఇవి కూడా చదవండి :
Shamshabad Lagacharla Road | శంషాబాద్ టూ లగచర్ల.. వంద మీటర్ల రేడియల్ రోడ్డు.. ఆ ఊళ్ల దశ తిరగడం ఖాయం!
Amazing Facts About Snakes | పాముల గురించి 16 ఆశ్చర్యకర నిజాలు! వీటిలో మీకెన్ని తెలుసు?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram