కడప కరోనా రోగులకు ఇక కష్టాలే
కోవిడ్ రోగులను చేర్చుకోమంటూ బోర్డులు నిబంధనల పేరుతో వేధింపులు అంటూ మండిపాటుసీఎం జిల్లా కడపలో ప్రైవేటు ఆస్పత్రుల మూసివేత సీఏం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడపలో ప్రైవేటు ఆస్పత్రులు నిరసన బాట పట్టాయి. ప్రైవేటు ఆస్పత్రులు, డాక్టర్లపై నిబంధనల సాకుతూ అధికారులు నుంచి ఎదురవుతున్న వేధింపులకు నిరసనగా కోవిడ్ రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకోమంటూ ఏకంగా తీర్మానమే చేశాయి. కడప నగరంలో ఉన్న ఆస్పత్రుల యాజమాన్యం అందరూ కలిసి గురువారం కడప ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో […]

కోవిడ్ రోగులను చేర్చుకోమంటూ బోర్డులు
నిబంధనల పేరుతో వేధింపులు అంటూ మండిపాటు
సీఎం జిల్లా కడపలో ప్రైవేటు ఆస్పత్రుల మూసివేత
సీఏం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడపలో ప్రైవేటు ఆస్పత్రులు నిరసన బాట పట్టాయి. ప్రైవేటు ఆస్పత్రులు, డాక్టర్లపై నిబంధనల సాకుతూ అధికారులు నుంచి ఎదురవుతున్న వేధింపులకు నిరసనగా కోవిడ్ రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకోమంటూ ఏకంగా తీర్మానమే చేశాయి.

కడప నగరంలో ఉన్న ఆస్పత్రుల యాజమాన్యం అందరూ కలిసి గురువారం కడప ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. ప్రభుత్వ అధికారులు నిబంధనల పేరుతో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని కేసులు పెట్టి, జరిమాన వేసి వేధిస్తున్నారని..నిరసనగా ఈ రోజు నుండి కోవిడ్ పెషేంట్ లను జాయిన్ చేసుకోవడం లేదు అని బోర్డులను ఆయా హాస్పిటల్ల ముందు ఉంచి స్వచ్ఛందంగా ఆస్పత్రులు మూసివేశారు. దీంతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డబ్బు పెట్టి. వైద్యం చేయించుకుందాం అన్నాకడప నగరంలో బెడ్ దొరకని పరిస్థితి ఏర్పడింది. కరోనా వస్తే కడపలో వైద్యం కరువేనా అంటూ వాపోతున్నారు. బతికి బట్టకట్టాలంటే కరోనా పెషేంట్ కడప గడప దాటితే తప్ప వైద్యం దొరకని పరిస్థితి.