KTR| ఈ పక్కనే మన జనతా గ్యారేజ్..ఒక్క ఫోన్ కొట్డండి: కేటీఆర్
జూబ్లీహిల్స్ ఓటర్లపై కాంగ్రెస్ గుండాలు, రౌడీలు బెదిరింపులకు పాల్పడుతున్నారని..ఎవరైనా బెదిరిస్తే ఈ పక్కనే ఉన్న జనతా గ్యారేజ్ తెలంగాణ భవన్ కు ఫోన్ కొట్టాలని..40 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తీసుకొని వస్తా.. ఎవడేం చేస్తడో చూస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు
విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఓటర్లపై కాంగ్రెస్ గుండాలు, రౌడీలు బెదిరింపులకు పాల్పడుతున్నారని..ఎవరైనా బెదిరిస్తే ఈ పక్కనే ఉన్న జనతా గ్యారేజ్ తెలంగాణ భవన్(Telangana Bhavan)కు ఫోన్ కొట్టాలని..40 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తీసుకొని వస్తా.. ఎవడేం చేస్తడో చూస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల(Jubilee Hills by-election)లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ విజయం కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆదివారం రహమత్ నగర్ లో నిర్వహించిన ప్రచారంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఏమిచ్చిండ్రని పథకాలను రద్దు చేస్తారు? అత్తకు 4 వేలు, కోడలుకు 2500 ఇస్తున్నరా? తులం బంగారం? స్కూటీలు ఇచ్చిండ్రా? అని ప్రశ్నించారు.
గత పదేండ్లలో మేం కూడా ఎన్నో ఎన్నికలు ఎదుర్కొన్నామని.. ఒకసారైనా మాకు ఓటేయకపోతే పథకాలు బంద్ చేస్తామని బెదిరించామా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి ఆ పార్టీ బ్లాక్‌మెయిలర్లకు కర్రుకాల్చి వాత పెట్టాలని ప్రజలను కోరారు. జూబ్లీహిల్స్ ఒక సీటు కోసం ముఖ్యమంత్రి, 14 మంది మంత్రులు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. రెండేండ్లలో ఒక్క మంచి పని అయినా చేశారా? గీ మంచి పనిచేసినం అని ఓట్లు అడిగే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉన్నదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమైంది. సర్వేలన్నీ ఇదే చెపున్నయ్. గత ఎన్నికల కంటే రెట్టింపు మెజార్టీ వస్తది. ఇక్కడ 4 లక్షల మంది ఓటేస్తే.. తెలంగాణలోని 4 కోట్ల మందికి మేలు జరుగుతుందని.. కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాకుండా ఓడిస్తే 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ సీఎంగా వస్తారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram